గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల టిడిపి, జనసేన ఎంత నష్టపోయాయో..వైసీపీకి ఎంత లాభం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ స్థాయిలో ఓట్లు చీలి వైసీపీక్ఈ మేలు జరిగింది. కానీ ఈ సారి వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని..వైసీపీని ఓడించాలని చెప్పి టిడిపి, జనసేనలు ఏకమవుతున్నాయి. పొత్తుకు రెడీ అయ్యాయి. రెండు పార్టీల పొత్తుతో వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదు.
ఇక టిడిపి, జనసేన పొత్తు వల్ల వైసీపీ భారీగా నష్టపోయే ప్రాంతాల్లో నరసాపురం కూడా ఒకటి. నరసాపురం పార్లమెంట్ లో భారీగా నష్టపోవడం ఖాయం. కేవలం గత ఎన్నికల్లో ఓట్లు చీలిక వల్ల నరసాపురం పరిధిలో వైసీపీ గెలిచింది. ఆ పరిధిలో ఆచంట, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఉండి, తణుకు సీట్లు ఉన్నాయి. వాటిల్లో పాలకొల్లు, ఉండి టిడిపి గెలవగా, మిగిలినవి వైసీపీ గెలిచింది. వైసీపీ 5 సీట్లు గెలవడానికి కారణం టిడిపి, జనసేనల మధ్య ఓట్లు చీలడం వల్లే.. 3 సీట్లలో టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. ఇక నరసాపురం, భీమవరంలో జనసేన కంటే వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే టిడిపికి పడిన ఓట్లు ఎక్కువ.

అలాగే నరసాపురం ఎంపీ సీటుని సైతం వైసీపీ అలాగే గెలుచుకుంది. అంటే టిడిపి, జనసేన కలిస్తే వైసీపీ పరిస్తితి ఏంటి అనేది ఊహించుకోవచ్చు. 2019 ఎన్నికల్లోనే ఒక్క సీటు గెలిచేది కాదు. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత ఉంది. టిడిపి, జనసేన కలుస్తున్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో నరసాపురంలో టిడిపి, జనసేన క్లీన్ స్వీప్ చేయడం ఖాయమే. అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఇక టిడిపి..ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకు సీట్లలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. జనసేన..తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం సీట్లలో పోటీ చేయవచ్చు.