తెలుగుదేశం పార్టీకి పూర్తి పట్టున్న జిల్లా శ్రీకాకుళం..మొదట నుంచి అక్కడ టిడిపికి ఆదరణ ఉంటూనే ఉంది. ఎన్టీఆర్ పై అభిమానం టిడిపికి బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత చంద్రబాబు కూడా సిక్కోలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. దీంతో సిక్కోలులో టిడిపికి ఆదరణ పెరిగింది. 2014 ఎన్నికల్లో కూడా జిల్లాలో టిడిపి హవా నడిచింది.
కానీ గత ఎన్నికల్లోనే అక్కడ టిడిపి దెబ్బతింది. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే టిడిపి 2, వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై యాంటీ పెరుగుతుంది. టిడిపి బలపడుతుంది. ఈ సారి టిడిపి హవా నడవటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జిల్లాలో దాదాపు టిడిపి అభ్యర్ధులు ఫిక్స్ అయినట్లే చెప్పాలి. టెక్కలిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బరిలో ఉంటారు. ఇక ఈయన గెలుపు డౌట్ లేదు. ఆ తర్వాత ఇచ్చాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ మళ్ళీ పోటీ చేయడం ఖాయం..ఇది ఎలాగో టిడిపి కంచుకోట. ఇక్కడ టిడిపి గెలుపుకు ఢోకా లేదు.
ఇటు పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావుల మధ్య పోటీ ఉంది. కానీ దాదాపు సీటు కలమటకే దక్కే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎవరు పోటీ చేసిన టిడిపి విజయం ఖాయమే. పలాసలో గౌతు శిరీష, ఆమదాలవలసలో కూన రవికుమార్ పోటీ చేయనున్నారు. వీరు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
పాలకొండలో నిమ్మక జయకృష్ణ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావు పోటీ చేస్తారు. ఈయన కాస్త టఫ్ ఫైట్ ఎదురుకుంటున్నారు. రాజాంలో కొండ్రు మురళీమోహన్ బరిలో ఉంటారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీ పోటీ చేసే ఛాన్స్ ఉంది.ఇక్కడ హోరాహోరీ ఉంది. నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈ సీటులో వైసీపీకి లీడ్ ఉంది.