May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

గిద్దలూరులో వైసీపీకి బాబు దెబ్బ..టీడీపీకి దక్కుతుందా?

ఆ నియోజకవర్గంలో 81 వేల ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ గెలిచింది.. గత ఎన్నికల్లో జగన్..పులివెందుల 90 వేల ఓట్ల మెజారిటీ గెలిస్తే..ఆ తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చిన స్థానం అది. అయితే అలాంటి స్థానంలో మళ్ళీ గెలవడం ఏమి అసాధ్యం కాదు. మెజారిటీలో సగం తగ్గిన పోనీ ముప్పావు వంతు తగ్గిన మళ్ళీ గెలవచ్చు. కానీ అలాంటి పరిస్తితి లేదు. అక్కడ ఓటమి అంచుకు వచ్చేసింది. దానికి వైసీపీ సొంత తప్పులు, టి‌డి‌పి బలం పెరగడం కారణం.

అలా భారీ మెజారిటీతో గెలిచి వైసీపీ ఓటమి అంచుకు వచ్చిన స్థానం ఏదో కాదు..ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు..81 వేల ఓట్ల మెజారిటీతో అన్నా రాంబాబు గెలిచారు. అంత భారీ మెజారిటీ అంటే ప్రజలు కూడా భారీగానే ఆశలు పెట్టుకుంటారు. నియోజకవర్గానికి ఏదో చేసేస్తారని అనుకుంటారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. అభివృద్ధి జరగలేదు..కనీస వసతులైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ లాంటి వసతులు సమకూరలేదు.

ఏదో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అవి గత ప్రభుత్వాల్లో అందుతున్నాయి. కాకపోతే ఇప్పుడు రెండు, మూడు పథకాలు ఎక్కువ వస్తున్నాయి. కానీ పన్నుల బాదుడు పెరిగింది. అన్నీ రేట్లు పెరిగాయి.   ఏదేమైనా గాని గిద్దలూరులో వైసీపీకి ఎదురుగాలి వీయడం మొదలైంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే రాంబాబుకు పాజిటివ్ కనిపించడం లేదు.

ఇలాంటి తరుణంలో చంద్రబాబు గిద్దలూరులో ఎంటర్ అయ్యారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా రోడ్ షో, సభ జరిగింది. వైసీపీ కంచుకోటగా ఉన్న గిద్దలూరులో ఈ స్థాయిలో టి‌డి‌పి సక్సెస్ అవ్వడంతో అక్కడ సీన్ మారిపోతుందని తెలుస్తోంది. వైసీపీ పట్ల విసిగిపోయిన ప్రజలు టి‌డి‌పి వైపుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇంకొంచెం కష్టపడితే నెక్స్ట్ ఎన్నికల్లో గిద్దలూరులో టి‌డి‌పి జెండా ఎగరడం ఖాయమే.