అద్దంకి అంటే గొట్టిపాటి..గొట్టిపాటి అంటే అద్దంకి..ఆ విధంగా అక్కడ పరిస్తితి మారిపోయింది. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ..ప్రజల కోసం పనిచేస్తే గొట్టిపాటి రవికుమార్‌కు ప్రజల మద్ధతు ఎక్కువగానే ఉంది. ఆయన ఇప్పటికే మూడుసార్లు గెలిచిన నాల్గవ సారి కూడా గెలిపించడానికి అద్దంకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ..ఆయనకు చెక్ పెట్టడం కష్టం. అద్దంకిలో గొట్టిపాటి స్ట్రాంగ్ గా ఉన్నారు..ఆ బలం ఏంటో లోకేష్ యువగళం పాదయాత్రతో తేలిపోయింది.
పాదయాత్రకు ఊహించని స్థాయిలో జనం వచ్చారు. కేవలం ఒక్కరోజులో 50 వేల మందికి గొట్టిపాటి భోజనాలు ఏర్పాటు చేశారంటే..పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక లోకేష్ పాదయాత్ర అద్దంకిలో టిడిపికి మరింత ఊపు తెచ్చింది. మరొకసారి గొట్టిపాటి గెలుపుకు బాటలు వేసింది. అయితే గొట్టిపాటి ఇప్పటికే మూడు సార్లు గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. నెక్స్ట్ టిడిపిలోకి వచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. ప్రజా సమస్యలని పరిష్కరించారు. అందుకే 2019లో వైసీపీ వేవ్ లో కూడా గొట్టిపాటి గెలిచారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గొట్టిపాటిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆయన గ్రానైట్ వ్యాపారాలని ఎలా దెబ్బతీయాలని చూశారో తెలిసిందే. కానీ కోర్టులకు వెళ్ళి గొట్టిపాటి గట్టిగా నిలబడ్డారు. ఇంకా ప్రజల్లోనే ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తల వంచలేదు.
అందుకే అద్దంకిలో గొట్టిపాటికి ప్రజా మద్ధతు తగ్గలేదు. ఇక ఈయనపై వైసీపీ నుంచి బాచిన కృష్ణచైతన్యని నిలబెడుతున్నారు. ఈయనకు సొంత పార్టీలోనే యాంటీ ఉంది. దీంతో అద్దంకిలో గొట్టిపాటికి చెక్ పెట్టడం కష్టమని చెప్పవచ్చు. మరొకసారి ఆయన గెలుపు ఖాయమే.