కృష్ణా జిల్లా అంటే టిడిపి కంచుకోట..ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కావడంతో ఇక్కడ మొదట నుంచి టిడిపి హవా కొనసాగుతూనే ఉంది. కానీ గత ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి దారుణంగా ఓడింది. సరే ఆ ఓటమి నుంచి కోలుకుని వెంటనే పికప్ అయింది. ఆధిక్యంలోకి వచ్చింది. కానీ అంతా బాగానే ఉంది..కాకపోతే అసలు ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతంలో టిడిపి పుంజుకోవడం లేదు.
ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరు గ్రామం..ఇప్పుడు అది పామర్రు నియోజకవర్గంలో ఉంది.. ఒకప్పుడు పామర్రు కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. అలాగే అక్కడ ఎక్కువసార్లు టిడిపి గెలిచింది. ఇటు గుడివాడ పక్కనే ఉన్న గన్నవరం సైతం టిడిపి కంచుకోట.ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువే. టిడిపి ఎక్కువసార్లు గెలిచింది. ఇలా మూడు స్థానాలు టిడిపికి పెద్ద సెంటిమెంట్ ఉన్న స్థానాలు.
కానీ ఇప్పుడు ఈ మూడు స్థానాల్లోనే టిడిపి పరిస్తితి దారుణంగా ఉంది. 2008లో ఏర్పడిన పామర్రు స్థానంలో ఇంతవరకు టిడిపి గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుంది. ఈ సారి కూడా గెలిచే ఛాన్స్ లేదని సర్వేలు అంటున్నాయి. అటు గుడివాడలో గత రెండు ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. కొడాలి నాని వరుసగా గెలుస్తున్నారు. నెక్స్ట్ కూడా ఇక్కడ కొడాలికి టిడిపి చెక్ పెట్టడం కష్టమని అంటున్నారు.
ఇక గన్నవరం 2019 వరకు టిడిపికి ఇక్కడ తిరుగులేదు. ఎప్పుడైతే టిడిపిలో బలం పెంచుకుని..2019లో గెలిచి వైసీపీలోకి వల్లభనేని వంశీ జంప్ అయ్యారో అప్పటినుంచి అక్కడ టిడిపి వీక్ అయింది. ఇక్కడ కూడా నెక్స్ట్ టిడిపి గెలిచే పరిస్తితి లేదని అంటున్నారు. టిడిపికి ఇక్కడ బలమైన నాయకుడు లేకపోవడం మైనస్.
గుడివాడలో నాయకులు ఉన్నా..సీటు ఎవరికి తేలకపోవడం మైనస్. పామర్రులో వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతని టిడిపి ప్లస్ గా మార్చుకోలేకపోవడం పెద్ద మైనస్. ఇలా మూడు స్థానాలు టిడిపికి కలిసి రావడంలేదు.