మొత్తానికి టిడిపి బలం పెరుగుతుంది..నెక్స్ట్ ఎన్నికల్లో టిడిపితో రిస్క్ అని జగన్ కు నిదానంగా అర్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. మొన్నటివరకు అధికార బలంతో టిడిపిని అణిచివేయడానికి చూశారు..కానీ అదే టిడిపికి పెద్ద ప్లస్ అయింది..వైసీపీ అంటే ఏంటో, జగన్ పాలన ఏంటో ప్రజలకు తెలిసింది. ఇక లేటెస్ట్ గా వస్తున్న సర్వేల్లో ఇంకా వైసీపే గ్రాఫ్ డౌన్ అయిందని, టిడిపి గ్రాఫ్ పెరిగిందని తేలింది. కష్టపడితే టిడిపి అధికారంలోకి రావడం ఖాయం.

అందుకే టిడిపి తో సీన్ అర్ధమయ్యే..జగన్ ఇంకా సెంటిమెంట్ అస్త్రాలని ప్రయోగిస్తున్నారు. తాను అన్నీ మంచి పనులే చేశానని, పేదల మనిషిని అని, పేదలకు పెత్తందార్లకు యుద్ధమని అంటున్నారు. అయితే జగన్ చేసిన మంచో ఏంటో ప్రజలకు బాగా తెలుసు. జగన్ పాలనలో పేద, మధ్య తరగతి వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో తెలుసు. ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అందుకే ఇంకా గెలవడం కష్టమని అర్ధమైనట్లు ఉంది. ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలు పెట్టడం, దొంగ ఓట్లు సృష్టించి గెలవాలని చూశారు.

అయితే టిడిపితో ఇబ్బంది అని అసెంబ్లీలో సైతం టిడిపి ఎమ్మెల్యేలని చిన్నవాటికే సస్పెండ్ చేయడం చూశాం. ఇక పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు లాంటి వారు సబ్జెక్ట్ మాట్లాడితే వైసీపీ లొసగులు బయటపడతాయని వారిని బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మాట్లాడటానికి మైకు ఇవ్వలేదని నిరసన తెలిపినందుకు సస్పెండ్ చేశారు. ఇక టిడిపి ఎమ్మెల్యేలని సైతం ప్రతిరోజూ సస్పెండ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే టిడిపికి ఎంత భయపడ్డారో అర్ధమవుతుంది. అందుకే టిడిపి లేకుండా తమ పనులు చేసుకెళ్లాలని చూస్తున్నారు. కానీ జనం గమనిస్తున్నారు..కాబట్టి వైసీపీకి చిక్కులు చుక్కలు కనబడటం ఖాయమని చెప్పవచ్చు.