మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని జగన్ పైకి చెబుతున్నారు గాని…వెనుక మాత్రం పెద్ద స్కెచ్ ఉంది. టిడిపి హయాంలో వచ్చిన రాజధాని అమరావతిని నాశనం చేయడం, రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ అక్రమాలు చేయడం..ఇక మూడు రాజధానుల పేరుతో..రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే జగన్ టార్గెట్.
ఇక విశాఖకు పరిపాలన రాజధాని పేరుతో..అక్కడ వైసీపీ చేస్తున్న రాజకీయం ఏంటి..అక్రమాలు ఏంటి అనేది అక్కడి ప్రజలకు బాగా తెలుసు. అలాగే రాజకీయంగా లబ్ది పొందాలనే కాన్సెప్ట్. అందుకే పదే పదే విశాఖలోనే కాపురం పెడతానని జగన్ చెబుతున్నారు. తాజాగా కూడా సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతానని జగన్ చెబుతున్న విషయం తెలిసిందే. దీని ద్వారా అక్కడ రాజకీయంగా పై చేయి సాధించాలని చూస్తున్నారు. కానీ జగన్ ఎంత రాజధాని కాన్సెప్ట్ తెచ్చిన అక్కడి ప్రజలు నమ్మడం లేదు. ఇప్పటికే రాజధాని పేరుతో విశాఖలో భూములు దోచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా తమకు రాజధాని కాదు..అభివృద్ధి కావాలని, సిఎం ఎక్కడ నుంచి పాలిస్తే

ఏముంది..మళ్ళీ ప్రభుత్వం మారితే రాజధాని మార్చేస్తారని, కాబట్టి తమకు కొత్త సంస్థలు తీసుకురావాలని, అభివృద్ధి జరగాలని, విశాఖ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ విశాఖ రాజధాని అని చెప్పిన దగ్గర నుంచి అక్కడ రచ్చ జరుగుతుంది తప్ప..అభివృద్ధి లేదని అంటున్నారు.
అందుకే విశాఖ రాజధాని అని చెప్పిన..అక్కడి ప్రజలు జగన్‌ని నమ్మడం లేదు. గత ఎన్నికల్లో గాలిలో విశాఖ వైసీపీ గెలిచింది..కానీ ఈ సారి ఎన్నికల్లో విశాఖ జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. ఇక జనసేనతో పొత్తు ఉంటే మెజారిటీ సీట్లలో సత్తా చాటడం ఖాయం