రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి తప్ప..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు..అదే ఉంటే ఎప్పటికైనా దెబ్బతప్పదు. ఇప్పుడు ఏపీలో జగన్‌కు అదే జరిగింది. అసలు ఇంకా తమకు తిరుగులేదని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని, టిడిపి పని అయిపోయిందని..ఇంకా 175కి 175 సీట్లు గెలిచేస్తున్నామని జగన్ భావిస్తూ వస్తున్నారు. అసలు గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపిని టార్గెట్ చేసి ఎలా దెబ్బతీస్తూ వచ్చారో తెలిసిందే.
టిడిపిని అణిచివేసే కార్యక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలిసిందే. ఇక చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలని..వైసీపీ నేతలు ఏ విధంగా బూతులు తిట్టారో తెలిసిందే. పైగా ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. కుప్పంలో కూడా అన్నీ ఎన్నికల్లో గెలిచింది. దీంతో కుప్పంతో సహ అన్నీ స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంటూ వచ్చింది. అయితే ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. టిడిపి పని అయిపోయిందని, ఇంకా తమకు తిరుగులేదని అనుకోవడమే పెద్ద పొరపాటు.

ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ముంచిది. మిగిలిన స్థానాల్లో గెలిచినా సరే అసలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోయింది. ఇక టిడిపి నుంచి నలుగురుని, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యేలని లాక్కుని వారిని నమ్ముకుని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలు గెలుచుకోవాలని బరిలో దిగారు.
కానీ అదే రివర్స్ అయింది..వైసీపీ నుంచి రివర్స్ ఓటింగ్ పడటంతో టిడిపి ఒకస్థానంలో గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చింది. అయితే చంద్రబాబు జగన్ మాదిరిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్లకుండా..పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ సైలెంట్ వ్యూహాలతో టిడిపిని విజయాలు దిశగా తీసుకెళుతున్నారు. అదే బాబు, జగన్ వ్యూహాలకు ఉన్న తేడా..
.
