ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇంకా టిడిపి కంచుకోట కానుందా? అంటే తాజా పరిస్తితులని చూస్తుంటే అవుననే పరిస్తితి ఉందని చెప్పవచ్చు. జిల్లాలో టిడిపి బలం పెరుగుతుందనే చెప్పాలి. అయితే 1999 ఎన్నికల్లోనే జిల్లాలో టిడిపి ఓ మాదిరి ప్రభావాన్ని చూపింది. కానీ 2004 నుంచి జిల్లాలో టిడిపి పెద్దగా సత్తా చాటడం లేదు. 2014లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టిడిపి 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
ఇక 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే వైసీపీ హవా నడుస్తోంది. అలాంటిది ఇప్పుడు సీన్ మారింది. సొంత ఎమ్మెల్యేలే రివర్స్ అయ్యే పరిస్తితి. మొదట వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి రివర్స్ అయ్యారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని, అధికారులు సహకరించడం లేదని ఆనం సొంత పార్టీపై ఫైర్ అయ్యారు. అలా అలా ఆయన పార్టీ నుంచి బయటకొచ్చారు.

ఇక తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చారు. సొంత పార్టీ వాళ్లే తనపై నిఘా పెట్టారని, ఫోన్ ట్యాప్ చేశారని, నిధులు ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. అలా అలా ఆయన బయటకొచ్చారు. ఇప్పుడు కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టిడిపిలో చేరుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..టిడిపికి క్రాస్ ఓటింగ్ వేశారని వైసీపీ అనుమానిస్తుంది. ఆయన కూడా ఎప్పటినుంచో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు..ఈ ముగ్గురే కాదు..ఇంకో ఒకరిద్దరు వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
వారంతా టిడిపి వైపు చూస్తున్నారు..దీంతో జిల్లాలో టిడిపికి ప్లస్ అవుతుంది. లేటెస్ట్ సర్వేలోనే టిడిపికి ఆధిక్యం కనిపించింది. మరి ఎన్నికలనాటికి సీన్ మారిపోవచ్చు. మొత్తానికి నెల్లూరు టిడిపికి కంచుకోటగా మారేలా ఉంది.
