అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఏదొక రాజకీయం కోణం ఉంటుందనే చెప్పాలి..ఒకటి రాజకీయంగా తమకు లబ్ది కలగడం లేదా టిడిపికఈ నష్టం జరగడం…ఇదే జగన్ కాన్సెప్ట్. ఇదే క్రమంలో జగన్ మూడు రాజధానులు అనే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. టిడిపి ప్రభుత్వంలో తీసుకొచ్చిన అమరావతిని దెబ్బకొట్టడానికి, రాజకీయంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో లబ్ది పొందడానికి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.
మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటుతున్న సరే..ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అయితే అమరావతి కోసం అక్కడ ప్రాంత ప్రజలు, ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి. కానీ ఏదొకవిధంగా స్కెచ్ వేసి..అమరావతిని దెబ్బతీయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు కేటాయించారు. ఇప్పుడు ఆ దిశగానే ముందుకెళుతున్నారు. కానీ దీన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారు..ఉద్యమం చేస్తున్నారు..దీనిపై నిరసనగా పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు.

కానీ అక్కడ స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పట్టుదలతోనే జగన్ ప్రభుత్వం ఉంది. అసలు రాజధాని కోసమని భూములు ఇస్తే…వాటిని వేరే వాళ్ళకు ఇవ్వడం ఏంటని అమరావతి రైతులు అంటున్నారు. అయితే అక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చి రాజకీయంగా లబ్ది పొందాలనే స్కెచ్ జగన్ వేస్తున్నారు. ఎలాగో అమరావతి ప్రాంతంలో వైసీపీపై నెగిటివ్ ఉంది. దీంతో ఆయా స్థానాల్లో గెలిచే అవకాశం వైసీపీకి లేదు.
దీంతో స్థానికేతర్లని తీసుకొచ్చి..అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి, అక్కడ వారిని ఓట్లరుగా నమోదు చేసి..రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. దానికి అమరావతి రైతులు బ్రేకులు వేయాలని చూస్తున్నారు. మొత్తానికి అమరావతిలో జగన్ వేసే ఎత్తులని, ఆ ప్రాంత రైతులు గట్టిగానే ఎదురుకుంటున్నారు.