నారా లోకేష్ పాదయాత్ర ద్వారా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అలాగే లోకేష్ పాదయాత్ర చేసే నియోజకవర్గాల్లో టిడిపికి ప్లస్ అవుతుంది. మహానాడుకు నాలుగురోజులు బ్రేక్ తీసుకున్న లోకేష్…జమ్మలమడుగులో పాదయాత్ర రీ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ పాదయాత్ర ముగింపు సభ భారీగా జరిగింది. జనం పెద్ద ఎత్తున వచ్చారు.
అయితే లోకేష్ జమ్మలమడుగులో పోటీ చేసే అభ్యర్ధి ఎవరు అనేది దాదాపు క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తుంది. టిడిపి ఇంచార్జ్ గా ఉన్న భూపేష్ రెడ్డి నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. కాకపోతే వైసీపీ కంచుకోటగా ఉన్న జమ్మలమడుగులో టిడిపి గెలుపు ఈజీ కాదు. గతంలో ఇక్కడ టిడిపికి పట్టు ఉంది..ఇప్పుడు కాస్త తక్కువ 1983 నుంచి 1999 వరకు అయిదుసార్లు టిడిపి అక్కడ గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇక టిడిపిలో కీలకంగా ఉండే పొన్నపురెడ్డి సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీలోకి వెళ్లారు.

అటు 2014లో వైసీపీ నుంచి గెలిచి టిడిపిలోకి వచ్చి మంత్రి అయిన ఆదినారాయణ..2019లో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత బిజేపిలోకి వెళ్లారు. దీంతో టిడిపికి నాయకులు లేరు. ఈ క్రమంలోనే ఆదినారాయణ సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి రేసులోకి వచ్చారు. ఆయనకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు.
అక్కడ నుంచి భూపేష్ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. తాజాగా లోకేష్ పాదయాత్ర జమ్మలమడుగులో టిడిపికి హెల్ప్ అయింది. ఇక ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాస్త మైనస్ ఉంది. కాకపోతే పార్టీ పరంగా వైసీపీ స్ట్రాంగ్..కాబట్టి టిడిపి ఇంకాస్త కష్టపడితే జమ్మలమడుగు సొంతం చేసుకోవచ్చు.