ఏపీలో మంత్రి జోగి రమేష్ పరిస్తితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని చెప్పవచ్చు. ఇటు ప్రాతినిధ్యం వహించే పెడన సీటు పోయేలా ఉంది..అటు సొంత స్థానం మైలవరం పోయేలా ఉంది. ఎటు చూసుకున్న చివరికి జోగికి సీటు దక్కేలా కనిపించడం లేదు. ఒకవేళ ఏ సీటు దక్కిన గెలుపు కూడా దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. వాస్తవానికి జోగి సొంత స్థానం మైలవరం…కానీ 2009 ఎన్నికల్లో వైఎస్సార్…జోగిని పెడనకు పంపించారు. అక్కడ గౌడ ఓట్లు ఎక్కువ ఉండటం, వైఎస్సార్ వేవ్ లో జోగి అప్పుడు గెలిచారు.

నెక్స్ట్ జోగి వైసీపీలోకి వచ్చారు..2014లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ పెడన వచ్చి పోటీ చేసి గెలిచారు. అటు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతానికి మంత్రిగా ఉన్న జోగికి పెడనలో పాజిటివ్ లేదు..అక్కడ గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయని ప్రచారం వస్తుంది. టిడిపి-జనసేన పొత్తు ఉంటే అసలు డౌట్ లేకుండా జోగి గెలవరని అంటున్నారు. ఈ పరిస్తితుల్లో జోగి..మైలవరంపై ఫోకస్ పెట్టారు. అక్కడ వసంతని సైడ్ చేసేలా జోగి రాజకీయాలు మొదలయ్యాయి.

దీంతో వసంత సైలెంట్ అయ్యారు..ఇదే క్రమంలో తాజాగా వసంత..జగన్‌తో భేటీ అయ్యారు. జోగిపై ఫిర్యాదు చేశారు. అవేం పట్టించుకోకుండా మైలవరంలో పనిచేయాలని, తనతో కలిసి మరో 30 ఏళ్ల పాటు రాజకీయం చేయాలని, గడపగడపకు తిరగాలని వసంతకు జగన్ సూచించారు. ఏమన్నా ఇబ్బందులు ఉంటే సిఎం సెక్రటరీ ధనుంజయరెడ్డికి చెప్పాలని చెప్పారు.

దీంతో మైలవరం సీటు వసంతకే దక్కుతుందనే ప్రచారం పెరిగింది. ఈ క్రమంలో జోగికి షాక్ ఇచ్చినట్లు అయింది. అటు మైలవరంపై ఫోకస్ చేసి పెడనని వదిలేశారు. దీంతో ఇప్పుడు రెండుచోట్ల జోగికి రిస్క్ పెరిగింది. చివరికి జోగికి ఏ సీటు దక్కేలా లేదని టాక్ నడుస్తోంది.
