కామినేని శ్రీనివాసరావు..ఏపీ బిజేపి సీనియర్ నేత. ఈయన 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓటమిని పొందారు. తర్వాత టిడిపి -బిజెపి పొత్తుల్లో భాగంగా బిజెపి అభ్యర్థిగా 2014లో కైకలూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.
కామినేని బిజెపికి నమ్మినబంటు, చంద్రబాబుకు వీర విధేయుడు, మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. వివాదాలకు దూరంగా ఉంటారని, అందరితోనూ సఖ్యంగా ఉంటారని కామినేనికి మంచి పేరుంది. గత ఎన్నికలలో పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బిజెపిలోనే కామినేని ఉన్నారు. టిడిపిలోకి మారమని ఆయన అభిమానులు ఒత్తిడి తెచ్చినా కామినేని బిజెపిలోనే కొనసాగుతున్నారు.
బిజెపి జనసేన పొత్తు లో ఉందనే కారణంతో బీజేపీ నుండి పోటీ చేయాలని ఆలోచనలో కామినేని ఉన్నారు. కానీ టిడిపి తో బిజెపి పొత్తు ఉంటుందో ఉండదు అని సందిగ్ధ పరిస్థితులలో కామినేని ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టిడిపి-జనసేన పొత్తు నేపథ్యంలో కామినేని జనసేన నుండి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. బిజెపి-టిడిపి-జనసేన పొత్తు లేకుండా టిడిపి-జనసేన పొత్తు మాత్రమే ఉంటే కామినేని పార్టీ మారి జనసేన నుండి పోటీ చేస్తారని రాజకీయ వర్గాలు అంటున్నారు.
పవన్ ప్రారంభించే నాలుగో విడత వారాహి యాత్రలో జనసేన తరఫున అన్నీ తానై నడిపించి పవన్ కు చేరువ కావాలని ప్రయత్నాలలో కామినేని ఉన్నారు. కైకలూరు నుండి జనసేన తరఫున పోటీ చేస్తే కచ్చితంగా విజయం వరిస్తుందని కామినేని ఆశాభావంతో ఉన్నారు. కామినేని వ్యూహాలు ఫలించి జనసేన టికెట్ ఇస్తుందా? బిజెపి తరఫున పోటీ చేస్తారా? సమాధానం కోసం కొన్నాళ్ళు ఆగాల్సిందే