కట్టు కథలు…అంటే లేని వాటిని ఉన్నట్లుగా క్రియేట్ చేసి చెప్పడం…లేదా ఉన్న వాటిని లేనట్లుగా చేసి చెప్పడం. అయితే ఇలాంటి కట్టు కథలు చెప్పడంలో వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి. గత ఎన్నికల ముందు ఎలాంటి కట్టు కథలు అల్లిందో..ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిందో చెప్పాల్సిన పని లేదు. అసలు టిడిపి ఎలాంటి మంచి పనులు చేసినా సరే..టిడిపిని నెగిటివ్ చేస్తూ దెబ్బతీశారు.
ప్రతిదాన్ని పెద్దగా చేసి నెగిటివ్ ప్రచారం చేసి..ప్రజల్లోకి వెళ్ళేలా చేసి లబ్ది పొందారు. అయితే పేరుకే కాదు చేతుల్లో కట్టు కథలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో వైఎస్ వివేకా హత్య కేసు, జగన్ కోడి కత్తి కేసు..వీటి గురించి ఏం జరిగిందో జనాలకు బాగా తెలుసు. ఈ రెండు చేయించింది చంద్రబాబు అని చెప్పి కట్టు కథలు అల్లి టిడిపిని నష్టం పర్చారు..ఇక ఒకే వర్గానికి డిఎస్‌పి పదవులు, పింక్ డైమండ్..ఆఖరికి చంద్రబాబు తాగే వాటర్ బాటిల్‌ని సైతం నెగిటివ్ చేశారు. అంటే వైసీపీ కట్టు కథలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

అవన్నీ చేసి టిడిపిని నెగిటివ్ చేసి..ఎన్నికల్లో లబ్ది పొంది వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ కట్టు కథలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలపై పన్నుల భారం పెంచడం, అప్పులు చేయడం, అభివృద్ధి చేయకపోవడం..కేవలం పథకాల పేరిట డబ్బులు పంచి..అబ్బో ప్రజలకు తమకంటే మంచి పనులు ఎవరు చేయడం లేదని చెప్పుకోవడం చేస్తున్నారు. ఇవి పెద్ద కట్టు కథలే. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్యలపై సుధాకర్ బాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. కానీ రివర్స్ లో చేతికి చిన్న గీత పడటంతో దానికి పెద్ద కట్టు కట్టి..అదిగో టిడిపి వాళ్ళు తనపై దాడి చేసేశారని సుధాకర్ బాబు ఓ కట్టు కథ అల్లారు. దీన్ని ప్రజలకు చెబుతానని అంటున్నారు. మరి గతంలో మాదిరిగా వైసీపీ కట్టు కథలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరనే చెప్పాలి. ఇలాంటి కట్టు కథలు వల్ల ఒక్క ఓటు రాదు.
