కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్ నాయకుడు..అది వైసీపీకి అని చెప్పవచ్చు ఫైర్ అంటే ఏమి లేదు చంద్రబాబుని బూతులు తిట్టడం వల్లే కొడాలి హైలైట్ అయ్యారు. పైగా వరుసగా గుడివాడలో గెలుస్తూ వస్తున్నారు. దీంతో తనకు ఎదురులేదనుకునే పరిస్తితి. అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. మంత్రిగా ప్రజలకు చేసింది పెద్దగా ఏమి లేదు. గుడివాడకు ఒరిగింది కూడా లేదు. కాకపోతే చంద్రబాబుని ఎడాపెడా తిట్టడమే కొడాలి పని.
అలా స్పెషల్ గా కొడాలి హైలైట్ అయ్యారు. కానీ ఏమైందో గాని కొడాలి సత్తా ఇప్పుడు తగ్గింది. ఈ మధ్య అసలు మీడియాలోనే కనిపించడం లేదు. తాజాగానే మీడియా ముందుకొచ్చి చంద్రబాబుని తిట్టేసి వెళ్ళిపోయారు. అంటే నేను ఉన్నానని చెప్పుకోవడానికి వచ్చినట్లు కనిపించింది. కానీ అంతకముందు కొడాలి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. అలాగే టిడిపి నేతలు భారీగా కౌంటర్లు ఇచ్చేవారు. ఇప్పుడు కొడాలిని సొంత పార్టీ శ్రేణులే పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
అలాగే ఇంకా ఎప్పుడొచ్చిన అవే బూతులు కదా అన్నట్లు ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.అంతకముందు కొడాలి అంటే ఓ ఇంపాక్ట్ ఉండేది.ఇప్పుడు అది లేదు. రాజకీయంగా కొడాలి పవర్ తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ఇక సొంత నియోజకవర్గం గుడివాడలో కూడా కొడాలికి ఎదురుగాలి మొదలైనట్లు తెలుస్తోంది.
తాను ఏం చేసిన గుడివాడలో గెలిచేస్తానని ధీమాలో ఉన్నారు..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కాస్త తగ్గుతుంది. వరుసగా నాలుగు సార్లు గెలిచారు. అయినా ప్రత్యేకంగా గుడివాడకు ఒరిగింది ఏమి కనబడటం లేదు. దీంతో ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తుంది. అటు టిడిపి నుంచి బలమైన నేతని రంగంలోకి దింపితే కొడాలికి చెక్ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.