ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన స్థానాల్లో చీరాల కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ టిడిపి అయిదుసార్లు గెలిచింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలిచింది. ఇక మధ్యలో 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014లో ఇక్కడ నవోదయ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈయన టిడిపి అధికారంలో ఉంది కదా..అని ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు ఉన్నారు.కరెక్ట్ గా 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి జంప్ చేశారు. వైసీపీ నుంచి బరిలో దిగారు. ఈ క్రమంలో టిడిపి నుంచి కరణం బలరాంని బరిలో దింపారు. జగన్ గాలి ఉన్నా సరే..చీరాలలో కరణం మంచి మెజారిటీతో గెలిచారు. కానీ అధికారం వైసీపీకి రావడంతో..ఇన్నేళ్లు టిడిపిలో పనిచేసినా సరే..అధికారం కోసం కరణం వైసీపీలోకి జంప్ చేశారు. అలా కరణం వైసీపీలోకి వెళ్ళాక..కరణం, ఆమంచిల మధ్య రచ్చ జరుగుతూ వచ్చింది. చీరాల సీటు కోసం పోరు నడిచింది.

ఇక ఈ మధ్యే ఆమంచిని పర్చూరు నియోజకవర్గానికి పంపించారు. ఇటు చీరాలలో కరణం బలరాం వారసుడు వెంకటేష్‌కు ఇంచార్జ్ ఇచ్చారు. దీంతో ఈ సారి చీరాలలో వైసీపీ నుంచి కరణం వెంకటేష్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. కరణం అటు వెళ్ళడంతో టిడిపిలో కొన్ని రోజులు వైసీపీ నుంచి వచ్చిన యడం బాలాజి ఇంచార్జ్ గా చేశారు. ఆ తర్వాత ఆయన సైడ్ అయ్యారు.
దీంతో ఎంఎం కొండయ్యని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన దూకుడుగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఆయనకు సీటు గ్యారెంటీ ఇవ్వలేదు. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే చీరాల సీటు ఆ పార్టీకే దక్కుతుందనే ప్రచారం ఉంది. అయితే సీటు దక్కించుకోవాలని కొండయ్య చూస్తున్నారు. చూడాలి మరి చీరాల సీటు ఎవరికి దక్కుతుందో.
