May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

లోకేష్‌@1000..27 స్థానాల్లో టీడీపీకి ప్లస్ ఎక్కడంటే.!

రాష్ట్రమంతా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు..4 వేల కిలోమీటర్లు తిరగాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఆయన పాదయాత్ర మొదలైనప్పుడు అన్నీ అనుమానలే అసలు..పాదయాత్ర సక్సెస్ అవుతుందా? ప్రజల ఆదరణ వస్తుందా? టి‌డి‌పికి కలిసొస్తుందా? అనే పరిస్తితి. టి‌డి‌పి శ్రేణులకే అనుమానం ఉంది. కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేసి లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు. మొదటలో కాస్త ప్రజల ఆదరణ తక్కువగా ఉన్న..నిదానంగా మాత్రం లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్దతు పెరిగింది.

ఇప్పుడు ఊహించని స్థాయికి లోకేశ్ వెళ్లారు. ఆయన ప్రజలతో మాట్లాడుతున్న తీరు, వారికి దగ్గరవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ప్రతి వర్గం ప్రజలని దగ్గర చేసుకునేలా వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత మద్ధతు పెంచుకుంటున్నారు. అలా అలా లోకేష్ ఇప్పుడు 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయ్యాయి. అయితే ఇప్పటివరకు లోకేష్ పాదయాత్ర 27 నియోజకవర్గాల్లో జరిగింది.

చిత్తూరులో 14 స్థానాలు, అనంతపురంలో 9, కర్నూలులో 4 స్థానాల్లో పాదయాత్ర జరిగింది. అయితే అనంత తప్ప..మిగిలిన రెండు జిల్లాలు వైసీపీ ఆధిక్యం ఉన్నవే. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర వల్ల ఆయా స్థానాల్లో సీన్ మారిందా? అంటే కొన్ని స్థానాల్లో రాజకీయాలు మారయని చెప్పవచ్చు. చిత్తూరులో దాదాపు 8 స్థానాల్లో టి‌డి‌పికి ప్లస్ అయింది.

ఇటు అనంతలో పాదయాత్ర చేసిన 9 స్థానాల్లో 7 చోట్ల టి‌డి‌పికి అడ్వాంటేజ్ ఉంది. ఇక కర్నూలులో డోన్, పత్తికొండ, ఆలూరు, ఆదోని స్థానాల్లో పాదయాత్ర చేశారు..ఈ నాలుగు చోట్ల టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. మొత్తం మీద లోకేష్ పాదయాత్ర టి‌డి‌పికి కలిసొస్తుంది. ఇదే ఊపు కొనసాగితే రాష్ట్రంలో టి‌డి‌పికి ప్లస్ అవుతుంది.