చంద్ర బాబు అరెస్ట్ తో టిడిపి పని అయిపోయిందని జగన్, వైసీపీ నాయకులు అనుకున్నారు. టిడిపి పార్టీ బాధ్యతలు తీసుకునే శక్తి లోకేష్‌కి లేదు అని ప్రత్యర్ధి పార్టీ నాయకులు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో టిడిపికి భవిష్యత్తు ఉండదు అని వైసిపి నాయకులు భావించారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ లోకేష్ తన తండ్రి బాధ్యతను భుజాన వేసుకున్నాడు. వయసు, అనుభవం తక్కువైనా కష్టకాలంలో తండ్రి బాధ్యతలు తీసుకొని పార్టీకి ఆపద్బాంధవుడిగా కనిపించాడు.
తండ్రి అక్రమ అరెస్టు తట్టుకొని, వైసిపి వ్యూహాలను అధిగమించి ,చంద్రబాబు నాయుడును బయటకు ఎలా తీసుకురావాలా అని ఆలోచన చేస్తూ లాయర్లతో మేధావులతో సంప్రదింపులు చేశాడు. ఒకవైపు పార్టీ కార్యకర్తలలో ధైర్యాన్ని నింపుతూ, మన పార్టీ నాయకుడు నిర్దోషి అని, ఎటువంటి కేసు లేకుండా బయటికి వస్తాడు అని ధైర్యం చెప్పారు. కార్యకర్తలకు భరోసాగా ఉన్నాడు. సలహాలు ఇచ్చాడు. చంద్రబాబు అరెస్టుతో కుంగిపోతున్న కుటుంబానికే కాదు, రాష్ట్ర టిడిపికి, టిడిపి అభిమానులకు పెద్దదిక్కయ్యాడు. కోర్టులో ఏమి జరిగినా సంయమనంతో ఉండాలని పార్టీ కార్యకర్తలకు చెప్పాడు. అక్రమ కేసు నుండి చంద్రబాబు నాయుడును బయటకు తీసుకురావడానికి న్యాయవాదులతో, మేధావులతో చర్చలు జరుపుతూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచించటంలో లోకేష్ చంద్రబాబు నాయుడు కన్నా మెరుగుగా ఆలోచించాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబుకు రిమాండ్ విధించిన తర్వాత తండ్రికి తోడుగా రాజమండ్రి వరకు రక్షణ కవచంలా నిలబడ్డాడు .జైలు లో చంద్రబాబునాయుడు ఉంచిన తరువాత పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ నేనున్నానని భరోసాని ఇచ్చాడు. కేసు గురించి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి, లోకేష్ ను కూడా అరెస్టు చేస్తామని వైసిపి నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొడుతూ ధైర్యంగా సమాధానం ఇస్తున్నాడు.
ఇంత ఆలోచన జ్ఞానం, ముందు చూపు ఉన్న యువ నాయకుడు లోకేష్ టిడిపి పగ్గాలు తీసుకుంటే టిడిపిలో నూతన ఉత్సాహం పెల్లుబుకుతోంది. యువతలో టిడిపి కి పట్టు పెరుగుతుందని చెప్పవచ్చు.
నిన్నటి వరకు పప్పు, తండ్రి చాటు కొడుకు అని లోకేష్ ని గేలిచేసిన వారందరూ ఈ రెండు రోజులలో లోకేష్ ప్రవర్తించిన తీరుకి ఫిదా అయిపోయారు. రాబోయే కాలానికి టిడిపిని నడిపించే సత్తా లోకేష్ లో ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.
ReplyReply allForward |