రాయలసీమలో సైకిల్ రాత మార్చారు..కోస్తాలో కదంతొక్కడమే ఆలస్యం..నారా లోకేష్ యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్నారు. అసలు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే..ఆయన పాదయాత్ర ఫెయిల్ అవుతుందని అనుకున్నవాళ్లే ఎక్కువ.ఆయనకు జనం రావడం కష్టమని అన్నారు. కొన్ని రోజుల్లోనే పాదయాత్ర ఆపేస్తారని అన్నారు. జగన్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది . అయినా సరే అన్నిటిని అధిగమించి సీమలో లోకేష్ పాదయాత్ర విజయవంతమైంది. కుప్పంలో మొదలైన పాదయాత్ర బద్వేలులో ముగిసింది.
నాలుగు ఉమ్మడి జిల్లాలు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఊహించని విధంగా పాదయాత్ర కొనసాగింది. అన్నీ వర్గాల ప్రజలని కలిశారు. సమస్యల పరిష్కారానికి మార్గాలు చెప్పారు. రాయలసీమలోని కష్టాలు చూసి..మిషన్ రాయలసీమ అంటూ టార్గెట్ పెట్టుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే తాగునీరు, సాగునీరు, పెట్టుబడులు, అభివృధ్ది, యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని లోకేష్ చెప్పారు.

ఇక పాదయాత్ర ముందు వరకు వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్ల కొన్ని స్థానాల్లో టిడిపికి పట్టు కనిపించింది. కానీ పాదయాత్ర వల్ల టిడిపి బలం మరింత పెరిగింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటల్లాంటి స్థానాల్లో టిడిపికి మద్ధతు పెరిగింది. ఉదాహరణకు కడపలో చివరిగా పాదయాత్ర ముగించిన బద్వేలులో టిడిపికి ఏ మాత్రం పట్టు లేదు. అక్కడ గెలిచి చాలా ఏళ్ళు అయింది.
కానీ అక్కడ పాదయాత్రకు భారీ స్థాయిలో జనం వచ్చారు. ఇక రోడ్ షోలో భారీగా జనం కనిపించారు. దీని బట్టి సీమలో లోకేష్ పాదయాత్ర ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు కోస్తాలో అడుగుపెట్టారు. నెల్లూరులో తాజాగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కోస్తాలో లోకేష్ పాదయాత్ర వల్ల టిడిపి బలం ఎంతవరకు పెరుగుందనేది చూడాలి.