రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతమైంది. రెండు రోజుల పాటు భారీ స్థాయిలో టిడిపి శ్రేణులు తరలివచ్చారు. ఇక రెండోరోజు లక్ష పైనే కార్యకర్తలు వచ్చారని అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎండ ఉన్న నిలబడ్డారు..సాయంత్రానికి జోరు వాన వచ్చిన నిలబడ్డారు. అలా పార్టీ కోసం టిడిపి శ్రేణులు అంకిత భావంతో మహానాడులో పాల్గొన్నారు.
ఇక మహానాడుని విఫలం చేయాలని వైసీపీ వేయని ఎత్తులు లేవు..మహానాడుకు వెళ్ళేందుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు..ప్రైవేట్ బస్సులకు బ్రేకులు వేశారు. అన్నీ రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్.. మహానాడుపైనే ఫోకస్ పెట్టారు. ఎలాగైనా ఫెయిల్ చేయాలని నానా రకాలుగా ప్రయత్నించారు. ఇక రాజమండ్రిలో టిడిపి ఫ్లెక్సీలు మధ్యలో వైసీపీ ఫ్లెక్షీలు పెట్టించారు. అధికార బలాన్ని మొత్తం ఉపయోగించి ఏ స్థాయిలో మహానాడుని దెబ్బతీయాలని చూశారో అన్నీ రకాలుగా చేశారు.
కానీ ఎన్ని చేసిన మహానాడు విఫలం కాలేదు..గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు అదే అంశం భరత్‌కు మైనస్ అయింది. రాజమండ్రిలో ఏ వైసీపీ నాయకుడు సైతం మహానాడుని టార్గెట్ చేయలేదు. ఎవరి పార్టీ కార్యక్రమం వారిది అన్నట్లు వదిలేశారు. కానీ భరత్ అలా చేయలేదు. దీంతో భరత్ పై సొంత పార్టీ వాళ్ళు సైతం మండిపడుతున్నారు.
ఇక ప్రజల్లో భరత్ పై నెగిటివ్ పెరిగింది..ఇలాంటి రాజకీయాలు సరికావు అని అంటున్నారు. ఎలాగో నెక్స్ట్ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయాలని భరత్ భావిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ పోటీ చేసిన గెలవడం కష్టమని అంటున్నారు. మహానాడు దెబ్బతో భరత్‌కు ఓటమి తప్పదని చెబుతున్నారు
