May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

మాజీ మంత్రి వర్సెస్ మంత్రి..వైసీపీలో రచ్చ..ఎదురుదెబ్బ తప్పదా?

అధికార వైసీపీలో ఎక్కడక్కడ ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక నియోజకవర్గం అని కాదు..చాలా స్థానాల్లో వైసీపీలో అంతర్గత పోరు ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రచ్చ ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు స్థానాల్లో ఇక్కడ పోరు ఉంది..దీని వల్ల వైసీపీకి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రధాన నేతల మధ్య కూడా రచ్చ ఉంది.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టి‌టి‌డి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల మధ్య అంతర్గత పోరు ఎప్పటినుంచో జరుగుతుంది.  వీరి పోరుతో సొంత పార్టీ నేతలే నలిగిపోతున్నారు. ఇదే క్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ , మాజీ మంత్రి బాలినేనిల మధ్య కూడా పోరు నడుస్తోంది. ఇటీవల మార్కాపురం సి‌ఎం సభలో ప్రోటోకాల్ ప్రకారం మంత్రిని..జగన్ తో పాటు పంపించారు గాని..మాజీ మంత్రి బాలినేనిని మాత్రం పంపించలేదు. దీంతో బాలినేని అలిగారు.

తాజాగా ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో నాయకులంతా కోరినా కూడా బాలినేని మాట్లాడలేదు. సమావేశం పూర్తికాక ముందే హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో మంత్రి సురేష్‌ కొంత తడబాటుకు గురయ్యారు. ఇద్దరు నేతలు పక్కపక్కనే ఉన్న సరే మాట్లాడుకోలేదు. దీని బట్టి  చూస్తే ప్రకాశం జిల్లా నేతల మధ్య పోరు ఎలా నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పోరు వల్ల నాయకుల మధ్య కన్ఫ్యూజన్ ఉంది. పైగా మంత్రి సురేష్ ప్రాతినిధ్యం వహించే యర్రగొండపాలెంలో…వైసీపీలో అసంతృప్తి నేతలు ఉన్నారు. వారు బాలినేని వైపు ఉన్నారు.

దీంతో రచ్చ మరింత ఎక్కువైంది. ఇలా ప్రకాశంలో వైసీపీలో పోరు నడుస్తుంది..వీరే మధ్యే కాదు..ఇంకా పలు స్థానాల్లో కూడా రచ్చ జరుగుతుంది. దీని వల్ల వైసీపీకే డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది.