ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న లంక ప్రాంతాల్లో టిడిపికి పట్టున్న వాటిల్లో ముమ్మిడివరం నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి బలం ఎక్కువ..1983, 1985, 1996, 1998 ఉపఎన్నికల్లో, 1999, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. కానీ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వల్ల..ఆ పార్టీ నుంచి పొన్నాడ సతీశ్ కుమార్ గెలిచారు.
జనసేన ఓట్లు చీల్చడంతో అదృష్టం కొద్ది పొన్నాడ 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్ళు అవుతున్నా సరే ముమ్మిడివరంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. గత టిడిపి హయంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది..కేవలం ఇప్పుడు పథకాలు అందుతున్నాయి. అయినా పన్నుల భారం పెరగడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీకి యాంటీ అవుతున్నారు. ఇటు టిడిపి నుంచి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) ఉన్నారు..ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రజల్లో ఉంటున్నారు…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

దీంతో ముమ్మిడివరంలో టిడిపి బలం పెరిగింది. ఎమ్మెల్యే పొన్నాడకు వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే డౌట్ లేకుండా గెలవాలంటే జనసేన సపోర్ట్ ఉండాలి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 33 వేల ఓట్లు పడ్డాయి. టిడిపి ఏమో 5 వేల ఓట్ల తేడాతో ఓడింది..అంటే ఓట్ల చీలిక జరిగి వైసీపీకి లాభం జరిగింది.
ఈ సారి టిడిపి-జనసేన పొత్తు ఉంటే డౌట్ లేకుండా వైసీపీ ఓడిపోయే ఛాన్స్ ఉంది. కాకపోతే పొత్తు ఉంటే సీటు దక్కించుకోవాలని జనసేన చూస్తుంది. కానీ ఈ సీటు వదులుకోవడానికి బుచ్చిబాబు సిద్ధంగా లేరు..తానే పోటీ చేసి గెలుస్తానని అంటున్నారు. చూడాలి మరి చివరికి ముమ్మిడివరం ఎవరికి దక్కుతుందో.
