ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో నంద్యాల కూడా ఒకటి..ఇక్కడ వైసీపీ రెండుసార్లు గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచింది. ఇప్పటికీ అక్కడ వైసీపీ బలంగానే ఉంది..దీనికి కారణం టీడీపీ అనే చెప్పాలి..అందులోనూ భూమా ఫ్యామిలీ అని చెప్పాలి. భూమా ఫ్యామిలీలో ఉన్న విభేదాలే వైసీపీకి పెద్ద ప్లస్.
మామూలుగా నంద్యాలలో ఒకప్పుడు టిడిపికి పట్టు బాగానే ఉంది..1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు…గతంలో నాగిరెడ్డి టిడిపిలో ఆ తర్వాత ప్రజారాజ్యంలో నెక్స్ట్ వైసీపీలోకి వచ్చారు. అలా వైసీపీ నుంచి గెలిచిన భూమా టిడిపి అధికారంలోకి రావడంతో పాత పరిచయాల ద్వారా ఆ పార్టీలోకి వచ్చారు తన తనయురాలు భూమా అఖిలప్రియతో కలిసి టిడిపిలోకి వచ్చారు. అయితే మధ్యలో ఆయన అనారోగ్యంతో మరణించారు.

దీంతో 2017 నంద్యాల ఉపఎన్నికలో టిడిపి నుంచి నాగిరెడ్డి సోదరుడు కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలయ్యారు. అటు ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఓడిపోయారు. అయితే ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తే పర్లేదు..అలా కాకుండా అఖిల..ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలో రాజకీయం నడిపిస్తున్నారు. కానీ బ్రహ్మానందరెడ్డిని కలుపుకోవడం లేదు. దీంతో టిడిపి శ్రేణుల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఇక నంద్యాల సీటుని తన సొంత సోదరుడు విఖ్యాత్ రెడ్డికి ఇప్పించుకోవాలని అఖిల ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలాగో బ్రహ్మానందరెడ్డి సైతం మళ్ళీ పోటీ చేయాలని చూస్తున్నారు. దీంతో భూమా ఫ్యామిలీలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇలా ఉండటం వల్ల టిడిపి పికప్ అవ్వడం లేదు..అదే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ గా మారుతుంది..దీంతో మళ్ళీ అక్కడ వైసీపీ గెలిచేలా ఉంది.