గత ఎన్నికల్లో జగన్ కొన్ని స్థానాల్లో ఒక ఫార్ములాతో వచ్చారు..అది ఏంటంటే కమ్మ వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి కమ్మ నేతలపై వైసీపీ నుంచి కూడా కమ్మ నేతలని నిలబెట్టారు. దీని ద్వారా కమ్మ ఓట్లు చీలిక రావడం, ఇతర వర్గాలు సపోర్ట్ చేయడం వల్ల గెలుపు ఈజీ అవుతుందని అనుకున్నారు. ఇక జగన్ ప్లాన్ వర్కౌట్ అయింది. అలాగే టిడిపి కమ్మ నేతలపై వైసీపీ కమ్మ నేతలు పోటీ చేసి గెలిచారు.

కానీ అలా కమ్మ వర్గం వైసీపీకి ఓటు వేసి గెలిపించినా సరే..జగన్ అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గం పై ఎలాంటి కక్ష సాధిస్తున్నారో చెప్పాల్సిన పని లేదు..దీంతో కమ్మ వర్గం పూర్తిగా యాంటీ అయింది..వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత పెరిగింది. ఇదే క్రమంలో వినుకొండలో గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడుపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగింది. అటు టిడిపి నుంచి ఓడిపోయిన జీవీ ఆంజనేయులుకు ప్రజా మద్ధతు పెరుగుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది.
అయితే ఎమ్మెల్యే బొల్లా అక్రమాలు, అరాచకాలు ఎక్కువగా ఉన్నాయని టిడిపి ఆరోపణలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా బొల్లా కొన్ని వివాదాల్లో ఉండటం సంచలనంగా మారింది. సొంత వాళ్ళు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా ఆయన మాటలతో మరింత వ్యతిరేకత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తానేనని, తనపై పోటీ చేయడానికి భయపడేంతగా ఎన్నికలు ఉంటాయని, అన్నింటికి సిద్ధంగా ఉన్నానని, రేపు జరగబోయే ఎన్నికల్లంటివి గతంలో ఎవరూ చూసి ఉండరని అన్నారు. టీడీపీ నేతలు తనను తక్కువ అంచనా వేస్తే సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని హెచ్చరించారు.
అంటే వచ్చే ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలు చేసైన గెలుస్తాననే విధంగా బోల్లా మాట్లాడారు. అవే ఇప్పుడు ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ అయ్యాయి. ఎవరైనా ప్రజలని మెప్పించి గెలవాలి..కానీ ఈయన గెలవడానికి ఏదైనా చేస్తానని అంటున్నారు. మొత్తానికైతే వినుకొండలో బొల్లా గ్రాఫ్ ఇంకా డౌన్ అయింది..ఆయన ఓటమి దిశగా వెళుతున్నారు.
