తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో నెల్లిమర్ల కూడా ఒకటి అని చెప్పాలి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో టిడిపి మొదట నుంచి సత్తా చాటుతూ వస్తుంది. అంతకముందు భోగాపురం స్థానంగా ఉండేది..అక్కడ టిడిపి 1983 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు టిడిపి గెలిచింది. అది కూడా టిడిపి నుంచి పతివాడ నారాయణస్వామి నాయుడు గెలిచారు.
ఇక 2009లో నెల్లిమర్లగా ఏర్పాడ్డాక పతివాడ తొలిసారి ఓడిపోయారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనకు వయసు మీద పడటంతో యాక్టివ్ గా రాజకీయాలు చేయట్లేదు. దీంతో నెల్లిమర్లలో పలువురు నేతలు రేసులోకి వచ్చారు. ఈ క్రమంలో ఆ సీటు కోసం పతివాడ మనవడు కూడా పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు..నెల్లిమర్ల బాధ్యతలు బంగార్రాజుకు ఇచ్చారు. మొదట నుంచి పార్టీ కోసం కష్టపడుతూ వస్తున్న బంగార్రాజు ..నెల్లిమర్లలో పార్టీని బలోపేతం చేస్తున్నారు.

కార్యకర్తలని కలుపుకుని వెళుతూ..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీంతో నెల్లిమర్లలో టిడిపి బలం పెరుగుతూ వస్తుంది. ఇదే సమయంలో అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న బద్దుకొండ అప్పలనాయుడుకు వ్యతిరేకత పెరుగుతుంది. గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన ఈయన..నెల్లిమర్లకు చేసిందేమి లేదు. అలాగే ఈయనపై సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకంగా ఉండే పరిస్తితి. ఈ క్రమంలో ఇక్కడ వైసీపీకి ఎదురుగాలి వీస్తూంది.
దీంతో నెల్లిమర్లలో టిడిపికి గెలుపు అవకాశాలు మెరుగు పడ్డాయి. అయితే బంగార్రాజు ఇంకాస్త కష్టపడితే..నెల్లిమర్లలో ఈ సారి టిడిపి గెలవడం ఖాయమని చెప్పవచ్చు.
