సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..ఈయన రాష్ట్ర ప్రజలకు పెద్దగా పరిచయం లేరనే చెప్పవచ్చు. ఏదో ఆయన నియోజకవర్గం వరకే పరిమితం..అసలు ఇంకా ఆయన నియోజకవర్గం ప్రజలకు పూర్తిగా తెలుసో లేదో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈయన పెద్దగా ప్రజల్లో ఉన్నట్లు కనిపించరు. గత ఎన్నికల్లో ఏదో జగన్ గాలిలో సంతనూతలపాటు నుంచి గెలిచేశారు. కేవలం 9 వేల ఓట్ల మెజారిటీతో టిడిపిపై గెలిచారు.

అయితే గెలిచాక ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువ..అభివృద్ధి చేసేది తక్కువ. అక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించడం కూడా గగనమే ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తప్ప సంతనూతలపాడు ప్రజలకు సుధాకర్ వల్ల ఒరిగింది ఏమి కనిపించడం లేదు. పైగా నియోజకవర్గంలో అక్రమాలు, దందాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి . ఈ క్రమంలో అక్కడ సుధాకర్ పై యాంటీ ఎక్కువైంది. ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా ఇక్కడ సుధాకర్ మళ్ళీ గెలవడం కష్టమని తేలింది. ఇక్కడ టిడిపి నుంచి బిఎన్ విజయ్ కుమార్ పనిచేస్తున్నారు.
ఈయన దూకుడుగా పనిచేస్తూ..సంతనూతలపాడులో టిడిపిని బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ వైసీపీ శ్రేణులు వరుసపెట్టి టిడిపిలోకి వస్తున్నారు. ఇలా అక్కడ వైసీపీకి యాంటీ పెరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా అసెంబ్లీలో సుధాకర్ బాబు చేసిన ఒక పని మరింత నెగిటివ్ తెచ్చేలా ఉంది. అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న కొండపి టిడిపి ఎమ్మెల్యే స్వామిపై సుధాకర్ దాడి చేశారు. దాడి చేసి.. స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద స్వామి పడిపోయారు.

ఈ సంఘటనతో సుధాకర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేపై దాడి చేయడం ఏంటని అన్నీ పార్టీలు సుధాకర్ పై ఫైర్ అవుతున్నాయి. ఈ ఘటనతో సుధాకర్ ఇంకా నెగిటివ్ తెచ్చుకుని..ఇంకా ఓటమిని ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు.