వైసీపీ మంత్రులు ఓటమి అంచున ఉన్నారంటే..డౌట్ లేకుండా ఉన్నారని చెప్పవచ్చు. మెజారిటీ మంత్రులు ఈ సారి ఓటమి దిశగా వెళుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే మంత్రులు అనే వారికి ప్రజలకు ఎక్కువ సేవ చేసే ఛాన్స్ ఉంటుంది..కానీ ఏపీలో మంత్రులు మాత్రం ఆ పనిచేయడం లేదు. ఎంతసేపు ప్రతిపక్ష నేతలని తిట్టడం, జగన్ కు భజన చేయడం. పేరుకు మంత్రులు గాని..మంత్రులకు తగ్గ పనులు ఎవరు చేస్తున్నట్లు కనిపించడం లేదు.
అలాగే సొంతంగా ఏ పనులు చేయడానికి మంత్రులకు అవకాశం లేదు. ఏదో సంతకాలు పెట్టడానికి మాత్రమే పనికొస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఏ పని అయినా సరే సజ్జల రామకృష్ణా రెడ్డి చూసుకోవాల్సింది. ప్రతి శాఖలో ఈయన జోక్యం ఉందనే విమర్శలు వస్తున్నాయి. అలాగే ఏ శాఖ నిర్ణయమైన మీడియాతో చెప్పాలంటే సజ్జలనే చెబుతున్నారు. అంటే ఏపీలో మంత్రుల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు తెలియదు
.

గతంలో ఏ శాఖ మంత్రి ఎవరంటే కాస్త అవగాహన ఉండేది..ఇప్పుడు ఎవరు మంత్రి అనేది అవగాహన లేకుండా పోయింది. ఏదో కొందరు సీనియర్లు, మీడియా ముందుకొచ్చి తిట్టే మంత్రులు తప్ప మిగతా వారు హైలైట్ కావడం లేదు. ఉదాహరణకు హోమ్ మంత్రిగా తానేటి వనిత ఉన్నారు. ఆమె మంత్రి అనే సంగతి ఎంతమందికి తెలుసు? అంటే చెప్పడం కష్టం.
రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, విశ్వరూప్, కొట్టు సత్యనారాయణ, ఉషశ్రీ చరణ్ ఇలా కొంతమంది మంత్రులనే తెలియడం లేదు. అలాగే మంత్రులపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంది. 25 మంది మంత్రులు ఉంటే దాదాపు 15 మంది పైనే ప్రజా వ్యతిరేకత ఉంది. అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సారి మెజారిటీ మంత్రులు ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది.
