గత ఎన్నికల్లో రెండుసీట్లలో పోటీ చేసి ఓడిపోయిన పవన్..ఈ సారి ఒకే సీటులో పోటీ చేస్తారని తేల్చి చెప్పేశారు. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్తితుల్లో రెండుచోట్ల పోటీ చేశానని, కానీ అప్పుడు తనపై కుట్ర పన్ని ఓడించారని, ఉన్న ఓట్లు కంటే అదనంగా ఓట్లు పోల్ అయ్యాయని, అంటే దొంగ ఓట్లతో తనని ఓడించారని పవన్ తాజాగా వారాహి యాత్రలో చెప్పుకొచ్చారు. ఈ సారి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని పవన్ చెప్పుకొచ్చారు.
అలాగే ఈ సారి ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి రెండు సీట్లలో పోటీ చేయడం లేదని చెప్పిన పవన్..ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. కానీ జనసేన అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం పవన్ భీమవరం బరిలో దిగుతారని తెలిసింది. ఇందులో మరో కన్ఫ్యూజన్ లేదని అంటున్నారు. ఓడిన చోటే పవన్ గెలవాలని అనుకుంటున్నారని, ఇక భీమవరంలో పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని తెలిసింది.

గత ఎన్నికల్లో ఓట్లు చీలడం వల్ల పవన్‌కు ఓటమి ఎదురైంది..కానీ ఈ సారి టిడిపితో పొత్తు ఉంది..దీంతో పవన్ భారీ మెజారిటీతో గెలుస్తారని అంచనాలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరంలో వైసీపీకి 70 వేలు ఓట్లు పడ్డాయి. జనసేనకు 62 వేలు,టిడిపికి 54 వేలు పడ్డాయి. పవన్ 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే టిడిపి, జనసేన అప్పుడే కలిసి ఉంటే పవన్ భారీ మెజారిటీతో గెలిచేవారు.
టిడిపి, జనసేన ఓట్లు కలిపితే లక్షా 16 వేలు..అంటే వైసీపీ కంటే 46 వేలు ఎక్కువ. ఇప్పుడు వైసీపీకి యాంటీ ఉంది..దీంతో భీమవరంలో పవన్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు