అధికారంలో ఉన్నాం కదా..ఏం చెప్పినా జనం నమ్మేస్తారు..తాము చెప్పేది..జనం చెప్పినట్లే అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. పైగా ఏం మాట్లాడినా ప్రజలు తమ వైపే ఉంటారనే భావన ఉంది. కానీ ఆ పరిస్తితి లేదనే సంగతి తేలిపోయింది. ప్రజలు వైసీపీపై వ్యతిరేకత తో ఉన్నారు. అయినా సరే వైసీపీ నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గడం లేదు.
ఇటీవల కూడా తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని చంద్రబాబు కొన్నారని లేనిపోని ఆరోపణలు చేశారు. కానీ అధికార పార్టీని వదిలేసి ఎమ్మెల్యేలు వచ్చారంటే పరిస్తితి ఎలా ఉందో తెలుస్తుంది..అలాగే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలని వైసీపీ లాక్కున్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టి వైసీపీ నేతలు ఏం చెప్పిన ప్రజలు నమ్మే పరిస్తితి లో లేరు. పైగా 175 సీట్లలో గెలిచేస్తాం..టిడిపి పని అయిపోయింది..అన్నీ పార్టీలు కలిసొస్తున్నాయి..అయినా సరే ప్రజలు జగన్ వైపే ఉన్నారని..ఓ మైండ్ గేమ్ వైసీపీ ఆడుతుంది. కానీ ఆ మైండ్ గేమ్ ఏ మాత్రం వర్కౌట్ కావడం లేదు.

అయితే తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఛాలెంజ్ మరీ కామెడిగా ఉంది. చంద్రబాబు, పవన్‌కు దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అంటే పులివెందుల జగన్ సొంత సామాజికవర్గం ఓట్లు 70 శాతం వరకు అందుకే ఆయనకు పట్టు ఉంది..వరుసగా గెలుస్తున్నారు.
అందుకే అక్కడ పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అలాంటప్పుడు జగన్..చంద్రబాబు కంచుకోట కుప్పంలో పోటీ చేసి గెలవాలని టిడిపి శ్రేణులు సవాల్ చేస్తున్నాయి. అసలు కుప్పం కాదు కదా..పాలకొల్లులో నిమ్మల రామానాయుడుపై జగన్ పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. కాబట్టి సవాల్ అనేది అర్ధవంతంగా ఉండాలని..ఏది పడితే అది చేసి..టిడిపిని తక్కువ చేయాలని చూస్తే సీన్ రివర్స్ అవుతుందని పేర్నికి కౌంటర్ ఇస్తున్నారు.