May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

రాయపాటి-కన్నా సీట్లలో ట్విస్ట్..బాబు డెసిషన్ ఏంటి?

తెలుగుదేశం పార్టీలో సీట్ల పంపిణీ కార్యక్రమం మొదలైపోయింది..ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా సరే..ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసే దిశగా చంద్రబాబు వెళుతున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. ఇంకా పలుచోట్ల అభ్యర్ధులని ఫిక్స్ చేయాలి. ఈ క్రమంలో సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల కోసం పోటీ ఎక్కువ ఉంది.

అక్కడ టి‌డి‌పికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆయా సీట్లలో పోటీ నెలకొంది.  ఈ క్రమంలోనే మాజీ రాయపాటి సాంబశివరావు తమకు రెండు సీట్లు కావాలని అడుగుతున్నారు. నరసారావుపేట ఎంపీ సీటుతో పాటు సత్తెనపల్లి లేదా పెదకూరపాడు అసెంబ్లీ సీటు ఇవ్వాలని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉండగా పలుమార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన రాయపాటి..2014లో నరసారావుపేట నుంచి టి‌డి‌పి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఆయన కాస్త రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన యాక్టివ్ అయ్యారు.

అయితే ఎప్పటినుంచో తనకు ఎంపీ సీటు, తన తనయుడు రంగబాబుకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా కూడా తనకు ఎంపీ సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. గత ఎన్నికల్లో అంటే డబ్బులు లేవని, ఇప్పుడు డబ్బులు ఉన్నాయని గెలుస్తానని అంటున్నారు. అలాగే తన తనయుడుకు సత్తెనపల్లి లేదా పెదకూరపాడు సీటు ఇవ్వాలని అంటున్నారు.

అటు కన్నా లక్ష్మీనారాయణ సైతం..సత్తెనపల్లి లేదా పెదకూరపాడు సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటు గుంటూరు వెస్ట్ సీటులో కూడా తీవ్ర పోటీ ఉంది. దీంతో ఏ సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. అయితే రాయపాటి ఫ్యామిలీకి అసలు సీటు దక్కుతుందో లేదో కూడా డౌట్. చూడాలి మరి బాబు..రాయపాటి, కన్నాలకు సీటు ఎక్కడ ఫిక్స్ చేస్తారో.