రెడ్డి వర్సెస్ రెడ్డి…ఈ పోరు ఎక్కువ జరిగేది రాయలసీమ జిల్లాల్లోనే అక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే రెడ్డి వర్గం మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీకి మద్ధతుగా ఉంటుంది. మెజారిటీ రెడ్లు అటు వైపే ఉంటారు. అందుకే గత ఎన్నికల్లో సీమలోని నాలుగు జిల్లాల్లో వైసీపీ నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో గెలిచారు.
కానీ వైసీపీని అంతమంది ఎమ్మెల్యేలని ఇచ్చిన సరే సీమకు వైసీపీ చేసిందేమి కనిపించలేదు. పైగా కొందరు రెడ్డి నేతలే బాగుపడ్డారు గాని..రెడ్డి వర్గానికి ఒరిగింది ఏమి లేదు. దీంతో రెడ్డి వర్గంలో మార్పు కనిపిస్తుంది. ఈ సారి వాళ్ళు టిడిపి వైపు చూస్తున్నారు. పైగా పాదయాత్రలో లోకేష్ ఇస్తున్న హామీలు రెడ్లని మారుస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో టిడిపి ఆధిక్యంలోకి వస్తుంది. ఇదే క్రమంలో గత రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్న మంత్రాలయంలో ఈ సారి టిడిపి పై చేయి సాధించేలా ఉంది.

2009లో ఇక్కడ టిడిపి గెలిచింది. టిడిపి నుంచి గెలిచిన బాలనాగిరెడ్డి వైసీపీలోకి వెళ్ళి..2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇక ఇప్పుడు సీన్ మారుతుంది. బాలనాగిరెడ్డికి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ఇదే సమయంలో టిడిపి నేత తిక్కారెడ్డి ప్రజా మద్ధతు పెంచుకుంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఆయనపై ఉంది. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
ఇక్కడి రెడ్డి సామాజికవర్గం కూడా తిక్కారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సారి మంత్రాలయంలో టిడిపి హవా కొనసాగేలా ఉంది.