రాజకీయాల్లో పరిస్తితులు ఎప్పుడు ఒకేలా ఉండవు..ఒకప్పుడు అబద్దాలు చెప్పి లబ్ది పొందిన మాత్రాన..శాశ్వతంగా అదే పనిలో ఉంటే ఎప్పటికైనా దెబ్బతప్పదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతుంది. గత ఎన్నికల ముందు వైసీపీ ఎన్ని అబద్దాలు చెప్పిందో లెక్క లేదు. టిడిపిని దెబ్బతీయడానికి ఎన్ని రకాలుగా ఫేక్ ప్రచారం చేశారో చెప్పాల్సిన పని లేదు. ఇక జగన్ చెప్పిన అబద్దాలని ప్రజలు నమ్మారు. దీంతో వైసీపీని గెలిపించి టిడిపిని ఓడించారు.
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం మారింది..అప్పుడు చెప్పిన అబద్దాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. అప్పుడు ఏ అంశాలతో సెంటిమెంట్ రగిలించి రాజకీయంగా లబ్ది పొందారో ఇప్పుడు అవే రివర్స్ అవుతున్నాయి. వీటిల్లో వివేకా హత్య, కోడి కత్తి కేసులు గురించి చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల ముందు ఈ అంశాల్లో జగన్ డ్రామాలు ఓ రేంజ్ లో నడిచాయి.

అసలు వివేకాని హత్య చేసింది..చంద్రబాబు, టిడిపి నేతలు అని తెగ ప్రచారం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడి కత్తి తో దాడి చేసింది టిడిపి మనిషి అని ప్రచారం చేశారు. ఇవన్నీ జనం నమ్మారు. కానీ అవే ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. అన్నీ అబద్దాలే అని తేలుతున్నాయి. కోడి కత్తి సింపతీ కోసం చేయించుకున్నారని తేలిపోయింది. ఇక వివేకాని సొంత వాళ్లే హత్య చేశారని సిబిఐ తేలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో జగన్ మరో బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది..ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ దిశగా వెళుతుంది. అరెస్ట్ కాకుండా అవినాష్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి విఫలమవుతున్నాయి. మొత్తానికి ఈ అంశాలు జగన్ కు టోటల్ గా రివర్స్ అవుతున్నాయి. అంటే గత ఎన్నికల ముందు ఏ అంశాలు జగన్‌కు మేలు చేసాయో..ఇప్పుడు అవే నష్టం చేయనున్నాయి.