జగన్ అంటే మాట తప్పడు..మడమ తిప్పడు అనే నినాదం ఉంటుంది..అయితే ఈ నినాదం ప్రజలు కాదు గాని..వైసీపీ కార్యకర్తలు నమ్ముతారు. చెప్పింది చేస్తాడు అని గట్టిగా నమ్ముతారు. ఎలాంటి పరిస్తుతుల్లోనైనా జగన్ మాట మీద నిలబడతాడు అని..వైసీపీ శ్రేణులు బాగా నమ్ముతాయి. అలా నమ్మడమే వైసీపీకి పెద్ద బలం.
కానీ ఇప్పుడు ఆ బలం పోతున్నట్లే ఉంది..ఎందుకంటే జగన్ అధికారంలోకి రాక ముందు అలా చేశారు గాని..అధికారంలోకి వచ్చాక మాట మీద నిలబడటం తక్కువ కనిపిస్తుంది..ఏదో కొన్ని అంశాల్లోనే మాట నిలబెట్టుకుంటున్నారు. ఉదాహరణకు మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పారో..ఏం చేస్తున్నారో తెలిసిందే. ఇక ఆసరా, రైతు భరోసా లాంటి చాలా పథకాలని చెప్పింది చెప్పినట్లుగా అమలు చేయడం లేదు. అధికారంలోకి రాగానే పెరిగిన ధరలని పూర్తిగా తగ్గించేస్తానని చెప్పారు. కానీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఉద్యోగులకు సిపిఎస్ రద్దు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అబ్బో ఇలా ఒకటి ఏంటి చాలా ఉన్నాయి..మాట ఇచ్చి తప్పినవి.

ఇదే సమయంలో పార్టీ అంశంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే..ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ ఒక పాలసీ పెట్టుకున్నారు. ఇది రాజకీయాల్లో చాలా మంచి పాలసీ..ప్రతిపక్షంలో దీన్ని ఫాలో అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పేశారు.నలుగురు టిడిపి, ఒక జనసేన ఎమ్మెల్యేని వైసీపీలోకి తీసుకున్నారు. వారి చేత రాజీనామాలు మాత్రం చేయించలేదు. పైగా తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి చేత వైసీపీ అభ్యర్ధులకు ఓటు వేయించుకున్నారు. మరి ఇలా మాట తప్పి..నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపికి ఓటు వేశారని..వారిపై నానా విమర్శలు చేయడానికి వైసీపీ నేతలకు అర్హత లేదనే చెప్పుకోవచ్చు.