గత ఎన్నికల్లో ఆ జిల్లా అని లేదు..ఈ జిల్లా అని లేదు..ప్రాంతాలు లేవు..అన్నిచోట్ల వైసీపీ హవానే..వైసీపీదే ఆధిక్యం..అందుకే వైసీపీ భారీగా సీట్లు గెలుచుకుంది. అదే తరహాలో సత్తా చాటాలని ఇప్పుడు టీడీపీ చూస్తుంది..వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి అన్నీ ప్రాంతాల్లో హవా చూపించాలని టిడిపి భావిస్తుంది.
అయితే ఇప్పటికే టిడిపికి పలు జిల్లాల్లో ఆధిక్యత వచ్చింది..ఇదే సమయంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ప్రాంతాల్లో కూడా సీన్ మారుతుంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఇక సాధారణ ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలని టిడిపి భావిస్తుంది. ఆ దిశగానే పనిచేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు..తూర్పు రాయలసీమకు సంబంధించి జోనల్ సమావేశం ఏర్పాటు చేసి…35 స్థానాల్లో టిడిపి సత్తా చాటాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు.

ఈస్ట్ సీమలో మొత్తం 35 సీట్లు ఉన్నాయి..కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రకారం..ప్రకాశంలో 8, నెల్లూరులో 8, తిరుపతిలో 6, చిత్తూరులో 7, అన్నమయ్య జిల్లాలో 6 సీట్లు ఉన్నాయి. మొత్తం 35 సీట్లు ఉన్నాయి. ఈ 35 సీట్లలో మెజారిటీ సీట్లలో టిడిపి ఆధిక్యంలోకి వచ్చిందనే చెప్పాలి. ప్రకాశం జిల్లాలో 5 సీట్లు, నెల్లూరులో 4 సీట్లు, తిరుపతిలో 2, అన్నమయ్య జిల్లాలో 2 సీట్లలో టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది..అలాగే కొన్ని సీట్లలో టిడిపికి ఆధిక్యం కనిపిస్తుంది..ఇంకోచెం కష్టపడితే తూర్పు రాయలసీమలో టిడిపి 20 సీట్ల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది.