తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇటు చంద్రబాబు, అటు లోకేష్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. బాబు రోడ్ షోలు,. సభలతో ప్రజల్లో ఉంటున్నారు. ఇటు లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. అయితే వీరికి ప్రజా స్పందన రోజురోజుకూ పెరుగుతుంది. ఇదే సమయంలో దాన్ని దెబ్బ తీయాలని వైసీపీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్న లోకేష్ పాదయాత్రకు చెక్ వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.
మొదట నుంచి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడానికే చూస్తున్నారు. తాజాగా ప్రొద్దుటూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రని చెడగొట్టడానికి వైసీపీ గట్టిగానే పన్నాగాలు పన్నింది. టిడిపి ఫ్లెక్సీల మధ్యలో రెచ్చగొట్టే విధంగా వైసీపీ

ఫ్లెక్సీలు కట్టారు. ఇక పాదయాత్ర సమయంలో లోకేష్ పై కోడి గుడ్లు విసిరారు. అవి తప్పి పక్కన వారిపై పడ్డాయి. దీంతో పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలోనే లోకేష్, టిడిపి శ్రేణులు వివేకా మర్డర్ కేసుపై ప్లకార్డులు ప్రదర్శించారు. అబ్బాయే బాబాయిని చంపాడు అని ప్లకార్డులపై రాశారు. దీనిపై పోలీసులు అభ్యంతరం చెప్పారు. అయినా లోకేష్ వెనక్కి తగ్గలేదు. తమని రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు, కోడి గుడ్లు విసిరితే ఏం చేశారని లోకేష్..పోలీసులని ప్రశ్నించారు. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్లకార్డులు పట్టుకునే ఉన్నారు. అయితే ప్రొద్దుటూరులో లోకేష్ పాదయాత్రకు పెద్ద ఎత్తున జనం వచ్చారు.
జగన్ సొంత జిల్లా కడపలో ఆ స్థాయిలో జనం వచ్చారంటే మామూలు విషయం కాదు. దీని బట్టి చూస్తే లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసిన అవి రివర్స్ అవుతున్నాయి.