ఆ సీటులో టీడీపీ వరుసగా నాలుగుసార్లు ఓడిపోయింది..వరుసగా 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. అయితే 2004, 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా ఉంది కాబట్టి ఓడిపోయిందని అనుకున్నారు. కానీ 2014లో టిడిపి గాలి ఉంది..అయినా సరే అక్కడ టిడిపి గెలవలేదు..ఇక 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు..వైసీపీ వేవ్ లో ఓడింది.

అలా నాలుగుసార్లు ఓడిన సీటులో ఇప్పుడు టిడిపి గెలుపు దిశగా వెళుతుంది. ఈ సారి అక్కడ పక్కాగా గెలవడం ఖాయమనే పరిస్తితి. అలా నాలుగుసార్లు ఓడి..ఇప్పుడు గెలుపు బాటలో వెళుతున్న సీటు ఏదో కాదు..ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల సీటు. అసలు ఇక్కడ టిడిపి మొదట నుంచి గెలిచిందే మూడుసార్లు..1985, 1994, 1999 ఎన్నికల్లోనే బాపట్లలో టిడిపి గెలిచింది. ఆ తర్వాత నుంచి వరుస ఓటములే. ఎంతమంది అభ్యర్ధులని మార్చిన ఫలితం లేకుండా పోయింది. 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన అనంతవర్మ..2004లో ఓడిపోయారు.

ఇక 2009లో టిడిపి నుంచి చీరాల గోవర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి అన్నం సతీశ్ ప్రభాకర్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఓడిపోయాక సతీశ్ టిడిపిని వదిలి బిజేపిలోకి వెళ్లారు. దీంతో బాపట్ల టిడిపి ఇంచార్జ్ గా వేగేశన నరేంద్ర వర్మని పెట్టారు. ఆయన వచ్చాక బాపట్లలో టిడిపి రాత మారింది. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల కోసం పనిచేస్తూ..పార్టీని ఊహించని విధంగా బలోపేతం చేశారు.
పైగా వైసీపీ నుంచి రెండుసార్లు గెలిచిన కోన రఘుపతిపై వ్యతిరేకత పెరిగింది..సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి బాపట్ల లో టిడిపి జెండా ఎగరడం ఖాయమనే చెప్పవచ్చు.