మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయామనే నిరాశ వైసీపీలో బాగా కనిపిస్తుంది..కానీ పైకి మాత్రం ఆ ఫలితాలతో తమకు పోయేదేమీ లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్న సరే లోలోపల మాత్రం ఒక టెన్షన్ మొదలైంది. ఇదే ఊపు కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం అసాధ్యమనే భావనలోకి వైసీపీ నేతలు వెళ్ళినట్లు కనిపిస్తున్నారు. ఇక టిడిపి గెలుపు అనేది ప్రజలందరికీ తెలిసిందే..దీంతో ఇప్పుడు టిడిపికి ఊపు కనిపిస్తుంది.

అందుకే దాన్ని ఎలాగోలా పోగొట్టాలని అనుకున్నారేమో..ఏదేమైనా టిడిపి విజయం గురించి ప్రజలు ఎక్కువ మాట్లాడుకోకూడదని డిసైడ్ అయినట్లు కనిపించారు..ఈ క్రమంలో అసెంబ్లీలో వైసీపీ..టిడిపి ఎమ్మెల్యేలపై దాడికి దిగింది. గత ఐదు రోజుల నుంచి స్పీకర్ టిడిపి ఎమ్మెల్యేలకు మాట్లాడటానికి మైకు సరిగా ఇవ్వడం లేదు. కానీ వైసీపీ వాళ్ళకు ఇచ్చి తిట్టించడం మాత్రం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కూడా జీవో నెంబర్ 1 రద్దు చేయాలని టిడిపి నిరసన చేపట్టింది. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చింది…అయినా స్పీకర్ యథావిధిగా తిరస్కరించారు. కానీ ఈ అంశంపై టిడిపి పోరాటం చేసింది. మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదు.
ఈ క్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూ ముట్టి ఎప్పటిలాగానే నిరసన తెలియజేశారు. ఇక ఎప్పటిలాగానే స్పీకర్ సస్పెండ్ చేశారు. కానీ తాజాగా మాత్రం నిరసన తెలియజేస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేశారు.

డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దాడి చేసి.. స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గర ప్లకార్డ్ లాక్కోని నెట్టేశారు. ఇలా చేసిందే కాకుండా రివర్స్ లో వైసీపీ తమపైనే దాడి జరిగిందని డ్రామా క్రియేట్ చేసింది. అయితే ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం టిడిపి విజయాన్ని డైవర్ట్ చేయడం కోసం..టిడిపి ఎమ్మెల్యేలపై దాడి చేశారని తెలుస్తోంది.