రాష్ట్రంలో టిడిపి బలపడుతున్న విషయం తెలిసిందే..వైసీపీకి ధీటుగా టిడిపి పికప్ అవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. పైగా వైసీపీపై వ్యతిరేకత పెరగడం టిడిపికి కలిసొచ్చే అంశం. అయితే కొన్ని చోట్ల వైసీపీపై వ్యతిరేకత ఉన్న సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టిడిపి ఉంది. పైగా వైసీపీకి టిడిపినే ప్లస్ అవుతుంది.
అలా వైసీపీకి టిడిపి ప్లస్ అవుతున్న స్థానాల్లో ఉమ్మడి అనంతపురం మడకశిర కూడా ఒకటి. అసలు మామూలుగానే మడకశిరలో టిడిపికి పెద్ద పట్టు లేదు. అక్కడ గెలిచిందే మూడుసార్లు. 1985, 1994, 2014లోనే గెలిచింది. 2014లో టిడిపి నుంచి ఈరన్న గెలిచారు. కానీ 2018లో ఆయన ఎన్నిక చెల్లుబాటు కాదని తేలడంతో పదవి కోల్పోయారు. అప్పుడు వైసీపీ నుంచి తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా తిప్పేస్వామి గెలిచారు. వైసీపీ నుంచి 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అయితే ఎమ్మెల్యేగా తిప్పేస్వామి..నాలుగేళ్లలో మడకశిరకు చేసింది ఏమి లేదు..ఆయనపై వ్యతిరేకత వస్తుంది. అయినా సరే ఇక్కడ వైసీపీనే ఆధిక్యంలో ఉంది..దానికి కారణం టిడిపిలో ఉన్న గ్రూపు తగాదాలు. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి పడటం లేదు. ఈ ఇద్దరు నేతలు రెండు గ్రూపులుగా ఉన్నాయి.
అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామికి..టిడిపి మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పరోక్షంగా సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు ఈరన్న వర్గం చేస్తుంది. ఇలా గ్రూపు తగాదాలతో మడకశిరలో టిడిపి వెనుకబడింది. ఇది ఇలాగే కొనసాగితే..మళ్ళీ మడకశిరలో వైసీపీ గెలుస్తుంది.