ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోటగాని..అక్కడ ఉండే అనంత సిటీ మాత్రం టిడిపికి పెద్దగా కలిసిరాదు. మొదట నుంచి టిడిపి అక్కడ గోప్ప విజయాలు ఏమి సాధించలేదు. 1983, 1985 ఎన్నికల్లోనే అక్కడ గెలిచింది.తర్వాత సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అనంత అర్బన్ సీటుగా ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2012 ఉపఎన్నికల్లో వైసీపీ గెలిచింది.
2014 ఎన్నికల్లో టిడిపికి ఛాన్స్ దొరికింది. టిడిపి నుంచి ప్రభాకర్ చౌదరీ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. వైసీపీ నుంచి అనంత వెంకట్రామి రెడ్డి గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో అనంత, చౌదరీలే మళ్ళీ ప్రత్యర్ధులుగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ సారి ఎన్నికల్లో అనంత అర్బన్ లో పరిస్తితులు ఎలా ఉంటాయి..ఎవరు పైచేయి సాధిస్తారనేది చూస్తే..ప్రస్తుతానికి వైసీపీ-టిడిపిల మధ్య టఫ్ ఫైట్ ఉంది. కాస్త వైసీపీకే ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇటు చౌదరీకి యాంటీగా టిడిపిలోనే జేసి దివాకర్ వర్గం పనిచేస్తుందనే టాక్ ఉంది. జేసి, చౌదరీలకు పెద్దగా పొసగడం లేదు.
అయితే వైసీపీ ఎమ్మెల్యే అనంతకు పెద్దగా పాజిటివ్ ఏమి లేదు. వైసీపీ పాలనలో అభివృద్ధి పెద్దగా జరగలేదు. దీంతో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. కాకపోతే టిడిపిలో వర్గ పోరు ఇబ్బందిగా మారింది. కానీ ఇక్కడ టిడిపి నేత చౌదరీకి ప్లస్..గతంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి..అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే కలిసొస్తుంది.
గత ఎన్నికల్లో అనంతలో జనసేనకు 10 వేల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు 20 వేల ఓటింగ్ జనసేనకు ఉండే ఛాన్స్ ఉంది. టిడిపి-జనసేన కలిస్తే అనంతలో వైసీపీని నిలువరించవచ్చు. అదే సమయంలో పొత్తు ఉంటే ఈ సీటు జనసేన అడిగే ఛాన్స్ కూడా ఉంది. కానీ టిడిపికే బలం ఎక్కువ కాబట్టి వదులుకోదు. మొత్తానికి చౌదరీ-అనంతల మధ్య గట్టి ఫైట్ ఉంటుంది.