విజయవాడ-గుంటూరు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా ఈ రెండు నగరాల్లో టిడిపి సత్తా చాటింది. అలాగే రెండు ఎంపీ సీట్లని కైవసం చేసుకుంది. శ్రీకాకుళం స్థానంతో పాటు విజయవాడ, గుంటూరులని కైవసం చేసుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు సీట్లని మళ్ళీ దక్కించుకోవాలనే లక్ష్యంగా టిడిపి ముందుకెళుతుంది.
కాకపోతే అభ్యర్ధుల విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ సిట్టింగ్ ఎంపీలే పోటీ చేస్తారా? లేదా అభ్యర్ధులు మారతారా అనేది క్లారిటీ రావడం లేదు. పైగా ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ టిడిపితో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పైగా కేశినేని ఇటీవల టిడిపిపై రివర్స్ అయ్యారు. తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఇక విజయవాడలో కేశినేనికి పోటీగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని అక్కడ రాజకీయం చేస్తున్నారు. విజయవాడ ఎంపీ సీటుని దక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో అక్కడ కాస్త రచ్చ ఎక్కువ ఉంది. సీటుపై క్లారిటీ లేదు.

ఇక సొంత పార్టీనే తిడుతున్న కేశినేని..పార్టీ వదిలివెళ్ళడం లేదు..ఇటు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విజయవాడ సీటుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీలో కనిపించి చాలా రోజులు అయింది. ఆయన సైతం నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనే డౌట్ ఉంది.
ఈ సీటుపై కూడా బాబు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే మళ్ళీ జయదేవ్‌ని నిలబెడతారా? లేక వేరే నాయకుడుని తీసుకొస్తారా? అనేది తెలియడం లేదు. చూడాలి మరి విజయవాడ-గుంటూరు సీట్లపై బాబు నిర్ణయం ఎలా ఉంటుందో.