విజయవాడ వైసీపీలో అంతర్గత పోరు పెరుగుతూ వస్తుంది. నేతల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల..ఆధిపత్య పోరు కనిపిస్తుంది. మామూలుగా విజయవాడలో టిడిపికి బలం ఎక్కువ..కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్, జనసేన ఓట్లు చీల్చడం వల్ల సిటీలో ఉన్న సెంట్రల్, వెస్ట్ సీట్లని వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం ఈస్ట్ సీటులోనే టిడిపి గెలిచింది. అయితే ఇప్పుడు గెలిచిన సీట్లలో కూడా వైసీపీ వ్యతిరేకత ఎదుర్కునే పరిస్తితి.

వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు..ఆయన మొదట విడతలో మంత్రిగా చేశారు. దేవాదాయ మంత్రిగా ఎన్ని ఆరోపణలు ఎదుర్కున్నారో చెప్పాల్సిన పని లేదు. అప్పుడు మైనస్ వచ్చింది. మంత్రి పదవి పోయాక ఆయనకు పాజిటివ్ కనిపించలేదు. ఎమ్మెల్యేగా పాజిటివ్ లేదు. అదే సమయంలో తాజాగా అక్కడ ఉండే కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ తాజాగా వైసీపీలో చేరారు.


ఈయనతో వెల్లంపల్లికి పడదు. కానీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను..ఆకులని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఇటీవలే ఆకులని..జగన్ దగ్గరకు తీసుకెళ్ళడంతో ఉదయభానుపై వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. ఒక వేదికలో ఇద్దరు నేతలు తిట్టుకోవడమే కాదు..కొట్టుకునే వరకు వెళ్లారు. పైగా వెల్లంపల్లి కాపు వర్గం గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో వెస్ట్ లో కాపు వర్గం వెల్లంపల్లికి మైనస్ గా మారింది.

అటు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు..స్థానిక ఎమ్మెల్సీకి పడని పరిస్తితి. ఇంకా కొందరు సొంత పార్టీ నేతలతో విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్తితి మల్లాదికి మైనస్ అవుతున్నాయి. పైగా గత ఎన్నికల్లో ఆయన గెలిచింది కేవలం 25 ఓట్ల మెజారిటీతోనే. ఇప్పుడు ఇంకా ఆయన నెగిటివ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. మొత్తానికి విజయవాడలో వైసీపీకి నెగిటివ్ కనిపిస్తోంది.

Leave feedback about this