చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టి రెండు వారాలు దాటేసింది. ఇంతవరకు ఆ కేసులో సరైన ఆధారాలు చూపించి..బాబు తప్పు చేశారని నిరూపించలేదు. పైగా రెండు రోజులు సిఐడి కస్టడీకి తీసుకుని విచారించింది. అటు ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు. ఇలా రిమాండ్ పొడిగిస్తూనే ఉన్నారు..కానీ స్కిల్ కేసులో ఆధారాలు చూపించడం లేదు. ఆరోపణలు తప్ప ఆధారాలు లేవని అందరికీ అర్ధమవుతుంది.
అయితే ఇదే అంశంలో సిఐడి కస్టడీలో బాబు..సిఐడి అధికారులని ప్రశ్నించినట్లు తెలిసింది. సిఐడి అధికారులు పలు ప్రశ్నలు సంధిస్తే రివర్స్ లో బాబు ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ‘ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు మీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు వచ్చాయని అంటున్నారు.. మీరేమంటారు’ అని సిఐడి అధికారులు..బాబుని ప్రశ్నించినట్లు తెలిసింది.
దానికి బాబు తీవ్రంగా స్పందించారు. ‘మీ చేతుల్లో అధికారం ఉందని, మీది దర్యాప్తు సంస్థ అని, ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు సేకరించి అడగాలి.. ఎవరో అన్నారంటూ గాలి ఆరోపణలు చేయొద్దని, ఇక 2021లోనే కేసు నమోదు చేశారని, తనని అరెస్టు చేసి 16 రోజులవుతోందని, ఈ మధ్యకాలంలో తన ఖాతాల వివరాలన్నీ సిఐడి అధీకృలు తెప్పించుకుని ఉండొచ్చు కదా! అని బాబు రివర్స్ లో ప్రశ్నలు వేశారు.
ఏ రికార్డూ చూడకుండా అనుమానం ఉందని అంటే ఎలా? దురుద్దేశపూర్వకంగా అడిగేవాటికి ఏమని సమాధానం చెప్పాలి అని బాబు అన్నట్లు తెలిసింది. ఈ ప్రశ్నలు చాలు. అసలు స్కిల్ కేసు లో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఆయనని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఏ ఆధారం లేకుండా వైసీపీ రాజకీయ కక్షతోనే బాబుని అరెస్ట్ చేశారని పూర్తిగా ప్రజలకు అర్ధమవుతుంది.
ReplyReply allForward |