వచ్చే ఎన్నికల్లో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఆయనకు ఏ సీటు ఇస్తారు? మళ్ళీ విశాఖ ఎంపీ సీటు ఇస్తారా? లేదా వేరే చోటకు మారుస్తారా? అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో భరత్ తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. విశాఖ ఎంపీగా పోటీ చేసి కేవలం 4 వేల ఓట్ల తేడాతో భరత్ ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలిచిన ఎంవివి సత్యనారాయణ వల్ల విశాఖకు ఒరిగింది ఏమి లేదు.
విశాఖలో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి ఇక్కడ టిడిపి నుంచి ఎవరు బరిలో ఉన్న గెలుపు ఖాయమనే పరిస్తితి. ఇప్పటికే భరత్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. విశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే ఆయనకు సీటు దక్కుతుందా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఇక్కడ చాలా సమీకరణాలు ఉన్నాయి. మొదట జనసేనతో పొత్తు ఉంటే విశాఖ ఎంపీ సీటు అడిగే ఛాన్స్ ఉంది. అటు బిజేపి కూడా పొత్తులో కలిస్తే ఇదే సీటు అడుగుతుంది. 2014లో పొత్తులో బిజేపికి ఈ సీటు ఇచ్చారు.
ఇక జనసేనతో పొత్తు ఉన్న ఈ సీటు టిడిపికే దక్కింది అనుకుంటే..గాజువాక ఎమ్మెల్యే సీటు జనసేన అడుగుతుంది. అక్కడ ఉన్న టిడిపి నేత పల్లా శ్రీనివాస్‌ని విశాఖ ఎంపీగా దింపే ఆలోచన చేయవచ్చు. పోనీ విశాఖ ఎంపీ కాదు..భీమిలి ఎమ్మెల్యే సీటు అనుకుంటే..ఇక్కడ కూడా జనసేన పోటీ వస్తుంది.
జనసేన వదులుకున్న గంటా శ్రీనివాసరావు సీటుపై క్లారిటీ రావాలి.ఇలా రకరకాల సమీకరణలు భరత్‌కు సీటు ఇచ్చే అంశంపై వస్తున్నాయి.మరి చివరికి భరత్‌కు ఏ సీటు ఇస్తారో చూడాలి.
ReplyReply allForward |