గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోయి వైసీపీ గెలవడానికి జనసేన హెల్ప్ చేసినట్లు అయింది. అయితే ఈ సారి వైసీపీని ఓడించాలని పవన్ సిద్ధమయ్యారు..కానీ ఒంటరిగా గెలవడం కష్టం..అందుకే ఆయన టిడిపితో కలిసి ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పడిపోతుందనే చెప్పవచ్చు.
అదే సమయంలో పొత్తు వల్ల ఇటు టిడిపికి, అటు జనసేనకు లాభమే. ఇక పొత్తు వల్ల పలువురు టిడిపినేతలకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. అలా మండపేట టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. గత మూడు ఎన్నికల్లో ఈయన మండపేట నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఆయనకు గెలుపు అవకాశాలు తగ్గాయని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న తోట త్రిమూర్తులు మండపేటలో వైసీపీ బలం పెంచారు. తన సొంత వర్గం కాపు ఓట్లని తిప్పుకుంటున్నారు.

అయితే టిడిపి-జనసేన-వైసీపీల మధ్య త్రిముఖ పోరు జరిగితే ఇక్కడ వైసీపీ గెలుపుకు ఛాన్స్ ఉంటుందని సర్వేలు చెప్పాయి. అదే సమయంలో టిడిపితో జనసేన కలిస్తే మాత్రం వైసీపీ గెలవడం కష్టమే. 2014లో జనసేన సపోర్ట్ చేయడం వల్ల మండపేటలో వేగుళ్ళకు 36 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు జనసేనకు 35 వేల ఓట్లు పడ్డాయి.
కానీ ఇప్పుడు వైసీపీ బలం కూడా పెరిగింది. దీంతో వేగుళ్ళకు కాస్త రిస్క్ పెరిగింది. కాకపోతే జనసేన సపోర్ట్ ఉంటే…ఇక్కడ డౌట్ లేకుండా వేగుళ్ళ మళ్ళీ గెలవడం ఖాయమని చెప్పవచ్చు.