నువ్వు కొట్టినట్లు నటించు..నేను ఏడ్చినట్లు నటిస్తా..ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బీజేపీ, వైసీపీ చేస్తున్న కార్యక్రమం అని అర్ధమవుతుంది. ఇంతకాలం వైసీపీకి పరోక్షంగా సాయం చేసిన బిజేపి ఇప్పుడు సడన్ గా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, జేపి నడ్డా..జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కేంద్రం 5 లక్షల కోట్లు ఇచ్చిందని, అయినా సరే అభివృద్ధి లేదని విమర్శలు గుప్పించారు.
ఇక బిజేపి విమర్శలకు వెంటనే వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ..కేంద్రం పెద్ద ఎత్తున అవినీతి చేసిందని, అలాగే రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం ఏమి లేదని..బిజేపిలో ఉన్న టిడిపి నేతలు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని అమిత్ షా, జేపి నడ్డా చదివేశారని..బీజేపీ కాస్త టీజేపీగా మారిందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

అసలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది బిజేపి నేతలు..కానీ వైసీపీ నేతలు..బిజేపితో టిడిపిని కలిపి తిట్టడం. అయితే వారి టార్గెట్ కూడా అదే..బిజేపి, టిడిపి ఒక్కటే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఎలాగో ఏపీలో బిజేపిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది..అది కాస్త టిడిపిపైకి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బిజేపి, వైసీపీ కలిసే ఈ ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది.
ఇంతకాలం వైసీపీకి బిజేపి సపోర్ట్ ఇస్తూ ఇచ్చింది..కావాల్సినప్పుడు అప్పులు పుట్టించింది. నిధులు కూడా కావాల్సినప్పుడు ఇచ్చింది. కానీ ఇప్పుడు బిజేపి ఏదో రివర్స్ అయినట్లు డ్రామా షురూ చేసింది. బిజేపిపై వ్యతిరేకత వైసీపీకి వెళ్లకుండా టిడిపికి వెళ్ళేలా చేసి..ఆ పార్టీకి నష్టం చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. కానీ జనాలకు ఎవరు ఏంటి..ఎవరు ఏం చేస్తున్నారనేది తెలుసు. అన్నీ గుడ్డిగా నమ్మరు. మరి బిజేపి, వైసీపీ డ్రామా ఎంతవరకు సాగుతుందో చూడాలి.