May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వెస్ట్ మంత్రులకు ఎదురుగాలి..గట్టెక్కడం కష్టమే. ‍!

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీయడం మొదలైన విషయం తెలిసిందే. సగానికి సగం ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. ఇందులో మంత్రుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. పేరుకే మంత్రులుగా ఉంటూ..అధికారాలు లేకుండా,. ప్రజల్లోకి వెళ్లలేని మంత్రులు మళ్ళీ గెలిచే పరిస్తితి కనిపించడం లేదు. కొందరైతే అసలు మంత్రులు అనే సంగతి ప్రజలకే తెలియడం లేదు. అంటే మంత్రుల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అలా ఉన్నవారిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఓటమి దిశగానే వెళుతున్నారు. వెస్ట్ లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. తానేటి వనిత హోమ్ శాఖ మంత్రిగా, కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా, కారుమూరి నాగేశ్వరరావు ..పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే…ఈ ముగ్గురు మంత్రులు అనే సంగతి రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు తెలియదు. ఇక కొందరికి తెలిసిన..వీరు ఏ శాఖల మంత్రులు అనేది పెద్దగా తెలియదు. అంటే వీరి పనితీరు ఎలా ఉంది? వారి పరిస్తితి ఏంటి అనేది అర్ధం చేసుకోవచ్చు.

ఇలా ఉన్న ముగ్గురు మంత్రులు ప్రజా వ్యతిరేకతని ఎక్కువగానే ఎదురుకుంటున్నారు. దీంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో గెలుపు అవకాశాలు తగ్గాయి. కొవ్వూరులో వనితకు గెలుపు అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఇటు గత ఎన్నికల్లో తణుకులో కేవలం 2 వేల ఓట్లతో గెలిచిన కారుమూరి పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అటు తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణకు జనసేన నుంచి సెగలు వస్తున్నాయి.

ఈ ముగ్గురు మంత్రులు ఓటమి అంచునే ఉన్నారు. ఇక టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే..ఇంకా డౌట్ లేకుండా వీరి ఓటమి ఖారారు చేసుకోవచ్చు.