హిందూపురం అంటే టిడిపి కంచుకోట అని చెప్పాల్సిన పని లేదు…హిందూపురం అసెంబ్లీ ఇంకా టిడిపి అడ్డా అందులో డౌట్ లేదు. అలాగే హిందూపురం పార్లమెంట్ సైతం టిడిపికి కంచుకోట. ఇక్కడ టిడిపి ఎక్కువసార్లే గెలిచింది. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో కూడా సత్తా చాటేది. అయితే గత ఎన్నికల్లోనే టిడిపి దారుణంగా ఓడింది. హిందూపురం పార్లమెంట్ తో పాటు..ఆ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సీట్లలో 6 చోట్ల టిడిపి ఓడింది. కేవలం హిందూపురం అసెంబ్లీలో బాలయ్య గెలిచారు.
రాప్తాడు, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి సీట్లలో వైసీపీ గెలిచింది. అయితే రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేక గాలి వస్తుంది. ఈ తరుణంలో హిందూపురంలో కూడా కాస్త వైసీపీకి వ్యతిరేకత ఉంది. కాకపోతే టిడిపి సరిగ్గా బలపడకపోవడం వల్ల ఇంకా లీడ్ వైసీపీకే కనిపిస్తుంది. టిడిపికి కొన్ని సీట్లలోనే బలం కనిపిస్తుంది. ప్రస్తుతం టిడిపికి హిందూపురం, కదిరి, పెనుకొండ సీట్లలోనే లీడ్ ఉంది.
అటు మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం సీట్లలో వైసీపీకి లీడ్ ఉంది. రాప్తాడులో పోటాపోటి ఉంది. అయితే ఈ సీట్లలో కూడా టిడిపి బలపడాల్సి ఉంది. పుట్టపర్తి టిడిపిలో కాస్త ఆధిపత్య పోరు ఉంది. పైగా సీటు విషయంలో క్లారిటీ లేదు. దీంతో అక్కడ టిడిపి వెనుకబడింది. అక్కడ క్లారిటీ వస్తే పట్టు సాధించవచ్చు. ఇటు ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిని ప్రజలు ఎక్కువ నమ్ముతున్నారు.
చేసేది ఏమి లేకపోయినా..కెమెరాలు పెట్టుకుని జనంలో తిరగడం కాస్త అడ్వాంటేజ్. కానీ అక్కడ పరిటాల శ్రీరామ్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఇటు మడకశిరలో టిడిపి చాలా వెనుకబడింది. రాప్తాడులో స్వల్ప ఆధిక్యంలో టిడిపి ఉంది. అయితే ఎన్నికల నాటికి బలం పెరిగితే హిందూపురం పరిధిలో టిడిపికి ఆధిక్యం వస్తుంది.