వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు నేపథ్యంలో కొన్ని సీట్ల విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. పొత్తులో భాగంగా టిడిపి…జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది..అసలు జనసేన ఎన్ని సీట్లు కావాలని డిమాండ్ చేస్తుందనేది క్లారిటీ లేకుండా ఉంది. ఇలా సీట్ల విషయంలో కన్ఫ్యూజన్ ఉండటం వల్ల..కొన్ని చోట్ల ఇంకా టిడిపి అభ్యర్ధుల విషయంలో క్లారిటీ రావడం లేదు.
ఇదే సమయంలో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ సీటు విషయంలో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది. గత ఎన్నికల్లో భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసి కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే మళ్ళీ ఆయన అక్కడే పోటీ చేస్తారా? లేదా? అనేది క్లారిటీ రావడం లేదు. వాస్తవానికి మళ్ళీ భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. పొత్తు లేకపోయిన గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే టిడిపికి గెలుపు ఛాన్స్ ఉంది.
కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే భారీ మెజారిటీ వస్తుంది. కాకపోతే..విశాఖ ఎంపీ సీటు జనసేన అడిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో బాలయ్య చిన్నల్లుడు పరిస్తితి ఏంటి అనేది తెలియడం లేదు. అయితే భరత్..అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆయన భీమిలి సీటుపై ఆశ పెట్టుకున్నారని సమాచారం. కానీ అక్కడ జనసేనతో చిక్కులు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఆ సీటు కూడా జనసేన అడిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి భరత్‌కు జనసేన వల్ల సీటు క్లారిటీ రావడం లేదు. చూడాలి మరి చివరికి భరత్ ఎక్కడ పోటీ చేస్తారో.