నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతల వారసులు బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు నెక్స్ట్ పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమ వారసులకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ జగన్ మాత్రం తనతో పాటు మీరే పోటీ చేయాలి..వారసులకు ఇప్పుడే అవకాశం ఇవ్వనని చెప్పారు. అయినా సరే కొందరు సీనియర్లు తమ వారసులకు సీట్లు ఇప్పించుకునేందుకు కష్టపడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు.తమ వారసుల సీట్ల కోసం కష్టపడుతున్నారు.
అయితే ఈ ఇద్దరు నేతల వారసులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు. ఇందులో చెవిరెడ్డి వారసుడు పోటీ చేయడం ఖాయమైందని తాజాగా తెలుస్తోంది. తాజాగా జగన్..చెవిరెడ్డి పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. దీంతో చంద్రగిరి బరిలో మోహిత్ పోటీ చేయడం ఖాయమైంది. ఇక చెవిరెడ్డి వారసుడు బరిలో ఉంటే టిడిపికి కాస్త అవకాశం దొరికినట్లే.

ఎందుకంటే ఇంతకాలం చంద్రగిరిలో చెవిరెడ్డి హవా వేరు..ఆయనకు ప్రజా మద్ధతు ఎక్కువ. ఆయన పర్సనల్ ఇమేజ్ తో గెలుస్తూ వచ్చేస్తున్నారు. మరి ఆ ఇమేజ్ తన తనయుడుకు వస్తుందా? అంటే చెప్పలేం. చెవిరెడ్డిని ఆదరించినట్లు..ఆయన తనయుడుని ఆదరిస్తారనేది చెప్పలేం. ఇలాంటి సమయంలో చంద్రగిరిలో టిడిపికి పుంజుకునే ఛాన్స్ ఉంది.
ఎప్పుడో 1994లో ఇక్కడ టిడిపి గెలిచింది..మళ్ళీ ఇంతవరకు గెలవలేదు..అయితే చెవిరెడ్డి బరిలో ఉంటే మళ్ళీ గెలవడం కష్టమని తేలిపోయింది. కానీ ఆయన వారసుడు బరిలో ఉంటే టిడిపికి కాస్త ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి గట్టిగా కష్టపడితే చంద్రగిరిలో పట్టు సాధించవచ్చు. ఒకవేళ చెవిరెడ్డి వారసుడుకు కూడా చెక్ పెట్టకపోతే చంద్రగిరిని టిడిపి మరిచిపోవచ్చు.
