టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇటీవల గుండెపోటుకు గురైన కోమాలోకి వెళ్లారు..ఇక గురువారం ఆయన మరణించారు. అయితే బచ్చుల మరణంతో గన్నవరం అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. మళ్ళీ గన్నవరంలో టిడిపి కొత్త నేతని వెతుక్కునే పరిస్తితి వచ్చింది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. దీంతో గన్నవరం టిడిపికి నాయకుడు లేకుండా పోయారు.

ఈ క్రమంలోనే అర్జునుడుని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన తన సాధ్యమైన మేర పనిచేసుకుంటూ వచ్చారు. ఇక చివరికి అనారోగ్యంతో మరణించారు. ఆయన హాస్పిటల్ లో ఉన్న సమయంలోనే గన్నవరంలో వంశీ అనుచరులు..టిడిపి నేత చిన్నా ఇంటిపై, టిడిపి ఆఫీసుపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు టిడిపి నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. ఇక ఈ ఘటన తర్వాత చంద్రబాబు..మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడుగా ఉన్న కొనకళ్ళ నారాయణని..గన్నవరం కొ ఆర్డినేటరుగా నియమించారు.

అయితే కొనకళ్ళ పెద్దగా వర్క్ చేసే పరిస్తితి లేదు..అక్కడ వంశీని తట్టుకునే బలం కొనకళ్ళకు లేదు..కాబట్టి ఆయనకు గాని, ఆయన ఫ్యామిలీకి గాని గన్నవరం సీటు ఇచ్చే పరిస్తితి లేదు. వంశీని ఢీ కొట్టాలంటే కమ్మ నేతనే పెట్టాలని అక్కడ టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాని, ఆయన భార్య గద్దె అనురాధాని గన్నవరం పంపిస్తారనే టాక్ వస్తుంది.
ఇటు టిడిపి యువనేత దేవినేని చందు..అవకాశం ఇస్తే తాను గన్నవరంలో పోటీ చేస్తానని అంటున్నారు. అటు ఎన్‌ఆర్‌ఐ పుట్టగుంట సతీశ్ సైతం రేసులో ఉన్నారు. మరి చివరికి గన్నవరం బరిలో ఎవరిని దింపుతారో చూడాలి.

